NTV Telugu Site icon

PM Modi: యూనిఫాం సివిల్ కోడ్‌పై ప్రధాని కీలక వ్యాఖ్యలు.. ఒకే దేశంలో 2 చట్టాలపై నడవదు..

Pm Modi 2

Pm Modi 2

PM Modi: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫాం సివిల్ కోడ్, UCC)ని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తుందని అంతా భావిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మంగళవారం పర్యటించారు. బీజేపీ పార్టీ ‘మేరా బూత్ సబ్సే మజ్‌బూత్’ ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్, యూనిఫాం సివిల్ కోడ్ పై వ్యాఖ్యలు చేశారు.

Read Also: Silver Price Hike: 48 గంటల్లో రూ.2300 పెరిగిన వెండి ధర.. కారణాలవే..!

ట్రిపుల్ తలాక్ ఇస్లాం నుంచి విడదీయరానిది అయితే.. ఈజిప్ట్, ఇండోనేషియా, ఖతార్, జోర్డాన్, సిరియా, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ వంటి ముస్లిం మెజారిటీ దేశాల్లో ముస్లింలు ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. ఒకే కుటుంబంలోని వేర్వేరు సభ్యులకు వేర్వేరు నిబంధలను కలిగి ఉండటం పనిచేయదని.. ఒకే దేశం రెండు చట్టాలపై నడవదని ఆయన యూనిఫాం సివిల్ కోడ్ ను ఉద్దేశించి అన్నారు. 90 శాతం సున్నీ ముస్లింలు ఉన్న ఈజిప్టు 80 నుంచి 90 ఏళ్ల క్రితమే ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు. ట్రిపుత్ తలాక్ కోసం వాదించేవారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లిం మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ప్రధాని అన్నారు.

ట్రిపుల్ తలాక్ కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాలేదని.. మొత్తం కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుందని అన్నారు. కొందరు ముస్లిం మహిళలను అణిచివేయడానికి ట్రిపుల్ తలాక్ ను సమర్థిస్తున్నారని.. అయితే ముస్లిం మహిళలు ఎక్కడి వెళ్లిని బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ వ్యతిరేకించే వారిపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తమ ప్రయోజనాల కోసం రెచ్చగొడుతున్నారని అన్నారు. భారతీయ ముస్లింలు, రాజకీయం కోసం కొన్ని పార్టీలు రెచ్చగొడుతున్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. రాజ్యాంగం ప్రజలందరి సమాన హక్కుల గురించి మాట్లాడుతుందని.. యూసీసీ అమలు చేయాలని సుప్రీంకోర్టు కూడా కోరిందని ఆయన తెలిపారు.

Show comments