దేశవ్యాప్తంగా వివాదం రేపింది హిజాబ్ ఘటన. కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధం ఎత్తివేతపై సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హిజాబ్ నిషేధానికి అనుకూలంగా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సమాధానం చెప్పాలని బసవరాజ్ బొమ్మై ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం హిజాబ్ ధరించడం తప్పనిసరి ధార్మిక విధానం కాదని ఇటీవల కర్ణాటక హైకోర్టు స్పష్టంచేసింది.
Read Also: VijayaSaiReddy: కులం, మతం, దేవుళ్ల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు
తరగతి గదుల్లో.. హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని ఉడుపికి చెందిన కొందరు విద్యార్థినులు దాఖలు చేసిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును అనేక మంది సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబరు 5కు వాయిదా వేసింది. ఇదిలా వుంటే.. ఈ పిటిషన్లపై విచారణకు రెండువారాల గడువివ్వాలని పిటిషనర్లు కోరారు.
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పిటిషనర్లు, లాయర్లు హాజరయ్యే అవకాశం ఉండటంతో వాయిదా కోరారు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.సుప్రీంకోర్టులో వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పిటిషనర్ల తీరుపై అభ్యంతరం వ్యక్తంచేశారు.కర్నాటక ప్రభుత్వం కూడా తన వాదన వినిపించాలని సూచిస్తూ నోటీసులు జారీ చేసింది. దీంతో కర్నాటక ప్రభుత్వం సెప్టెంబర్ 5 కల్లా అఫిడవిట్ దాఖలు చేయడంతో పాటు వాదనలు వినిపించవలసిన పరిస్థితి ఏర్పడింది.