Giriraj Singh: బ్రిటీష్ కాలం నుంచి అమలులో ఉన్న అస్సాం అసెంబ్లీలోని రెండు గంటల నమాజ్ విరామాన్ని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఎత్తేసింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ శనివారం ప్రశంసించారు. మతం ఆధారంగా ప్రాధాన్యత ఇవ్వకూడదని అననారు. ఈ చర్య తీసుకున్న అస్సాం సీఎం, అసెంబ్లీ స్పీకర్, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. చట్టంలో ఏకరూపత కలిగి ఉండటం చాలా అవసరం మరియు ఏ మత సమాజానికి ప్రాధాన్యత ఇవ్వకూడదని ఆయన బీహార్ బెగుసరాయ్‌లో మాట్లాడారు.
Read Also: Maharashtra: సోదరిని ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పడేసిన తమ్ముడు..
హిందుత్వవాదిగా పేరున్న గిరిరాజ్ సింగ్, అస్సాం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి నేతలపై ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు ఇదే విధంగా ఏదో రోజు భారత్‌ని పాకిస్తాన్, బంగ్లాదేశ్‌గా మారుస్తారని అన్నారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ వంటి నాయకులు ముస్లిం ఓటు బ్యాంకుకు ఛాంపియన్లని ఎద్దేవా చేశారు. వారు తమ మార్గంలోనే ఉంటే ప్రతీ శుక్రవారం దేశవ్యాప్తంగా సెలవు ఇచ్చేవారని దుయ్యబట్టారు.
హిందువులు వారంలో చాలా రోజులను పవిత్రంగా జరుపుకుంటారని, కానీ ఎప్పుడూ సెలవు కోరుకోరని గిరిరాజ్ సింగ్ అన్నారు. హిందువులు శివుడిని పూజించే సోమవారం, హనుమంతుడిని పూజించే మంగళవారం సెలవుల్ని కోరుకోరని చెప్పారు. ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశాన్ని పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లా మారుస్తారని అన్నారు. అస్సాంలో 1937లో ముస్లిం లీగ్‌కి చెందిన సయ్యదు సాదుల్లా జుమ్మా సమయంలో 2 గంటల విరామాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి కొనసాగుతున్న ఈ పద్ధతిని తొలగించారు.