Site icon NTV Telugu

Supreme Court: “ఆస్తి వివాదాల”పై హిందూ మహిళలకు సుప్రీంకోర్టు కీలక సూచన..

Supreme Court

Supreme Court

Supreme Court: తమ తదనంతరం ఆస్తిని ఎవరికి పంచాలనే దానిపై హిందూ మహిళలు వీలునామా రాసుకోవాలనీ సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. దేశంలోని మహిళలందరికీ, ముఖ్యంగా హిందూ మహిళలకు, తమ ఆస్తి వారసత్వంపై భవిష్యత్ వివాదాలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా వీలునామా రాసుకోవాలి అంటూ కీలక సూచనను సుప్రీం కోర్ట్ చేసింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ సూచనల్ని చేసింది. హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15 ప్రకారం ఆస్తి పంపకం విషయంలో జరిగే కుటుంబ వివాదాలను దృష్టిలో పెట్టుకొని కోర్టు ఈ తీర్పుఇచ్చింది. ప్రస్తుతం అమలులో ఉన్న Hindu Succession Act, 1956 – Section 15(1)(b) ప్రకారం, ఒక హిందూ మహిళ వీలునామా లేకుండా చనిపోతే, ఆమె భర్త , కుమారుడు, కుమార్తె ఎవరూ లేకపోతే… ఆమె ఆస్తి తల్లిదండ్రుల కు వెళ్తుంది. ఈ చట్టం విషయంలో మహిళల తల్లిదండ్రుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో వివాదాల కారణంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

Read Also: Maoists killed: మూడు రోజులుగా కూంబింగ్.. ఏడుగురు మావోయిస్టులు మృతి!

1956లో చట్టం రూపొందించినప్పుడు మహిళలు పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదిస్తారని ప్రభుత్వం ఊహించలేదని.. కానీ ఇప్పుడు విద్య, ఉద్యోగాలు, వ్యాపారాల్లో ముందుకు వెళ్తున్న మహిళలు గణనీయంగా స్వంత ఆస్తులు సంపాదిస్తున్నారని, అలాంటి ఆస్తుల విషయంలో వారు వీలునామా రాకుండా చనిపోతే, ఆస్తి భర్త వైపు బంధువులకే వెళ్లడం తల్లిదండ్రులకు బాధ కలిగించే అంశమని కోర్టు గమనించింది. అయితే కోర్టు సెక్షన్ 15(1)(b) చెల్లుబాటుపై తీర్పు ఇవ్వలేదు. సరైన పక్షాలు సరైన సందర్భంలో ఈ అంశాన్ని సవాల్ చేయవచ్చని కోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రుల హక్కులపై వివాదం వస్తే – ముందుగా ‘మధ్యవర్తిత్వం’ తప్పనిసరి అని కోర్ట్ స్పష్టం చేసింది.
ఒక హిందూ మహిళ వీలునామా లేకుండా చనిపోయి, ఆమె తల్లిదండ్రులు లేదా వారి వారసులు ఆస్తిపై హక్కు కోరితే, ప్రీ-లిటిగేషన్ మధ్యవర్తిత్వం తప్పనిసరి తెలిపింది. వివాదాల మధ్యవర్తిత్వం రాష్ట్ర, జిల్లా, తాలూకా స్థాయి లీగల్ సర్వీసెస్ అథారిటీలు నిర్వహించాలని, ఈ విధానం వల్ల కోర్టులకు వెళ్లే కేసుల సంఖ్య తగ్గించడమే కాకుండా, కుటుంబాల మధ్య గొడవలు పెరగకుండా చూడొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

Exit mobile version