NTV Telugu Site icon

Madhya Pradesh: హిందూ యువతిపై ముస్లిం అత్తింటివారి దాడి.. బిడ్డకు ఇస్లామిక్ పేరు పెట్టాలని ఒత్తిడి..

Madhya Pradesh

Madhya Pradesh

Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో దారుణం చోటు చేసుకుంది. బిడ్డకు ఇస్లామిక్ పేరు పెట్టేందుకు నిరాకరించిందనే కోపంతో హిందూ యువతిపై ముస్లిం అత్తామామలు దాడికి పాల్పడ్డారు. తన బిడ్డకు ఇస్లామిక్ పేరు పెట్టడానికి నిరాకరించినందుకు భర్త తన స్నేహితులతో తనపై అత్యాచారానికి కుట్ర పన్నినట్లు, చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది. మహిళ ఫిర్యాదు మేరకు ఆమె భర్త షాహిద్ అహ్మద్ అలియాస్ రాజ్, అత్త షబ్నం, కోడలు సానియా, వారి బంధువులు వసీం అక్తర్, నౌమాన్, ఫైజల్ ఖాన్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఫిర్యాదుతో మంగళవారం సాయంత్రం మహిళకు వైద్యపరీక్షలు నిర్వహించారు.

Read Also: Red Fort Terror Attack: పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ క్షమాభిక్ష తిరస్కరణ..

2019లో ఓ కాల్ సెంటర్‌లో పనిచేస్తున్న సమయంలో బాధిత మహిళకు షాహీద్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అక్కడ అతను రాజ్‌గా యువతికి పరిచయం చేసుకున్నాడు. ఇద్దరు రిలేషన్ కొనసాగించారు. షాహీద్ తన కుటుంబ నేపథ్యాన్ని దాచి పెట్టి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఇందుకు యువతి కూడా ఒప్పుకుంది. అయితే, ఖజ్రానాలోని అతని ఇంటికి వెళ్లిన సందర్భంలో షాహిద్ ముస్లిం కుటుంబానికి చెందినవాడి గుర్తించింది. వేర్వేరు మతాలు కావడంతో అతడిని పెళ్లి చేసుకోలేదని చెప్పింది. అయితే, షాహిద్ తాను హిందూ మతంలోకి మారుతానని ప్రామిస్ చేయడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.

మొదట్లో అంతా సజావుగా సాగినప్పటికీ మహిళ గర్భం దాల్చిన తర్వాత పరిస్థితులు మారాయి. తనకు పుట్టిన కొడుకుకు అత్తమామలు ముస్లిం పేరు పెట్టాలని పట్టుబట్టారు. మతపరంగా ఎలాంటి వేధింపులు ఉండవని షాహిద్ చెప్పిన ప్రామిస్ గురించి మహిళ గుర్తు చేస్తూ,తన కుమారుడికి ముస్లిం పేరును ఎందుకు ఎంపిక చేస్తున్నారని ప్రశ్నించింది. దీంతో షాహిద్, అతని తల్లి షబ్నం, కోడలు సానియా ఆమెను దుర్భాషలాడుతూ, శారీరకంగా దాడి చేశారు. పిల్లాడికి ముస్లిం పేరు పెట్టాలని వేధించారు. పేరు పెట్టకుంటే బిడ్డను చంపేస్తానని బెదిరించడంతో పాటు భర్త తన స్నేహితులు, బంధువులతో తనపై అత్యాచారం చేసేందుకు ప్లాన్ చేసినట్లు ఆమె ఆరోపించింది. ఈ కేసులో భర్త, అత్త, కోడలిని పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టు ముందు ప్రవేశపెట్టారు.