Site icon NTV Telugu

Himanta Biswa Sarma: భారత్ లోనే అనేక మంది “హుస్సేన్ ఒబామాలు”.. వివాదాస్పదమైన సీఎం వ్యాఖ్యలు

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma: బీజేపీ కీలక నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ప్రధాని అమెరికా పర్యటనలో ఉన్న సందర్భంలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు బారాక్ ఒబామా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ప్రధాని మోదీతో మాట్లాడితే, భారత్ లో మైనారిటీల హక్కులను రక్షించకపోతే భారతదేశం విడిపోవచ్చని ఆయనతో చెబుతానని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎంను.. మీరు ఒబామాను అరెస్ట్ చేసేందుకు అమెరికా వెళ్లారా..? అంటూ ఓ విలేకరి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘భారతదేశంలోనే అనేక మంది హుస్సేన్ ఒబామాలు ఉన్నారని.. వారిని ఎదుర్కోవడానికి నా తొలి ప్రాధాన్యం’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగింది. అస్సాం పోలీసులు ప్రాధాన్యతల ప్రకారం నడుచుకుంటారని ఆయన అన్నారు.

Read Also: PM Modi: ఈజిప్టు పర్యటనకు బయలుదేరిన ప్రధాని.. 1997 తర్వాత ఇదే తొలిసారి..

ఈ వ్యాఖ్యలపై ఎన్సీపీ నేత క్లైడ్ క్రాస్టో మండిపడ్డారు. భారత్ లో మతం ఆదారంగా వివక్ష లేదని అమెరికా పర్యటనలో ప్రధాని చెప్పిన వ్యాఖ్యలను ఇది ఉల్లంఘించడమే అవుతుందని ఆయన అన్నారు. దీనిపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ కూడా బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ మాట్లాడుతూ.. హిమంత బిశ్వ సర్మ ప్రధాని కోటరీలో చాలా కీలకమైన వ్యక్తి అని.. అమెరికాలో ప్రధాని చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఆయన వ్యాఖ్యానించారని అన్నారు. అన్నారు.

Exit mobile version