Himant Biswa Sarma comments on Love Jihad: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి ‘‘లవ్ జీహాద్’’ గురించి ప్రస్తావించారు. జాతీయ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. లవ్ జీహాద్ అనేది నిజం అని.. దీనికి ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ దారుణహత్యే నిదర్శమని అన్నారు. లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా దేశంలో కఠినమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నాను. నిందితుడు అఫ్తాబ్ పాలీగ్రాఫ్ టెస్టులో హిందూ యువతులతో సంబంధం ఉన్నాయని తెలిపిన నేపథ్యంలో, ఈ దారుణ హత్యలో లవ్ జీహాద్ మూలాలు ఉన్నాయని ఆయన అన్నారు. ముస్లిం యువకులు ప్లాన్ ప్రకారం హిందూ యువతులను మతం మార్చడానికి లవ్ జీహాద్ కు పాల్పడుతున్నారని పలు సందర్భాల్లో హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించాడు.
Read Also: Maharashtra: తండ్రిపై కోపంతో.. మైనర్ బాలికపై 15 ఏళ్ల బాలుడి అత్యాచారం, హత్య
హిందువులు శాంతి ప్రేమికులు సాధారణంగా అల్లర్లకు పాల్పడరని ఆయన అన్నారు. 2002 తర్వాత గుజరాత్ రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొన్నాయని.. గుజరాత్ లో ఇప్పుడు కర్ఫ్యూ లేదని, శాంతి నెలకొంది అని అన్నారు. అస్సాంలో శాంతి నెలకొనేలా నేను చూసుకోవాలి అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో తన 22 ఏళ్ల జీవితం వృధా అయిందని హిమంత బిశ్వ శర్మ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కుటుంబాన్ని పూజించే వాళ్లమని.. బీజేపీలో దేశాన్ని పూజిస్తాం అని అన్నారు. అస్సాంలో కాంగ్రెస్ మంత్రిగా పనిచేసిన 2015లో బీజేపీలో చేరారు. ప్రస్తుతం అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటీవల పలు సందర్భాల్లో హిమంత బిశ్వశర్మ లవ్ జీహాద్ అంశంపై వ్యాఖ్యానించారు. శ్రద్ధా వాకర్ హత్యను ఇందుకు ఉదాహరణగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇటీవల గడ్డంతో ఉన్న రాహుల్ గాంధీని ‘సద్దాం హుస్సేన్’తో పోల్చారు. ఇలా తరుచు ఏదో కామెంట్స్ తో జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉన్నారు శర్మ.