Himachal Pradesh : వరదలతో రూ.8 వేల కోట్ల మేర నష్టం: సీఎం సుఖ్విందర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్ లో మాత్రం పరిస్థితి దారుణంగా మారిందని చెప్పాలి.. భారీగా కురిసిన వర్షాలకు వరదలు ఎక్కువగా వస్తున్నాయి.. భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత 75 ఏండ్లలో ఎన్నడూలేనంతగా వానలు కురవడంతో రాష్ట్రం వణిపోయింది. వరదలు పోటెత్తడంతో రోడ్లు, ఇండ్లు కొట్టుకుపోయాయి. సుమారు వందకు పైగా మరణించారు. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.8 వేల కోట్ల మేర నష్టం వాటిళ్లిందని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు వెల్లడించారు..
ఈ వరదలు రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగించాయని దాంతో కేంద్ర ప్రభుత్వం మాకు ఆర్థిక సాయం అందించాలని ఆయన తెలిపారు..2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన విపత్తు నిధులు రూ.315 కోట్లను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశామన్నారు. వర్షాలు, వరదలతో రూ.8 వేల కోట్లు నష్టం జరిగినట్లు అంచనావేశామని స్పష్టం చేశారు.. కులు జిల్లాలోని కసోల్, మణికరణ్ మరియు ఇతర పరిసర ప్రాంతాలలో చిక్కుకున్న కొంతమంది పర్యాటకులు తమ వాహనాలు లేకుండా బయటకు వెళ్లడానికి నిరాకరించారు. పరిస్థితి సాధారణీకరించి, అన్ని రహదారులు తెరిచే వరకు వారంతా మరికొన్ని రోజులు వెనుదిరగాలని నిర్ణయించుకున్నారు.కసోల్-భుంటార్ రహదారిపై దున్‌ఖారా సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడటంతో అనేక వాహనాలు కదలలేదు మరియు పర్యాటకులు అవతలి వైపుకు చేరుకోవడానికి ట్రెక్కింగ్ చేయవలసి వచ్చింది. అయితే, ఈ పర్యాటకులను జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
ఇకపోతే సాధ్యామైన త్వరగా రోడ్లు, విద్యుత్, నీటి సరఫరాను కొంతవరకు పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుత ఆపత్కాలంలో కేంద్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలన్నారు. మరోసారి భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సన్నద్ధమై ఉందని చెప్పారు. ప్రజల ప్రాణాలు రక్షించడానికే అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. విపత్తు వేళ మాజీ సీఎం జై రామ్ ఠాకూర్ రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు ఇబ్బందులు ఆయనకు తమాషా గా ఉందని తీవ్రంగా మండిపడ్డారు..
తాజావార్తలు
-
US Iran Conflict: మిడిల్ ఈస్ట్‌లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
-
Pawan Kalyan: పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం వరకు.. పవన్ కల్యాణ్ 55 ఏళ్ల ప్రయాణం వెనుక అసలు సీక్రెట్ ఇదే!
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!