భార్యాభర్తల అన్నాక చిన్న చిన్న గొడవలు.. అలకలు ఉంటాయి. కొద్దిసేపు కోపం ఉంటుంది. మరికొద్దిసేపటికే కలిసి పోతుంటారు. ఇలా ప్రతి సంసారంలోనూ కామన్‌గా జరుగుతుంటాయి. అంతమాత్రాన తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే కాపురాలు కూలిపోతాయి. అయితే ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
ఇది కూడా చదవండి: Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల్లో ముస్లింలు బీజేపీకి ఓటు వేశారా?
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ యువ జంట మధ్య ఓ వింతైన తగాదా జరిగింది. చివరికి చినికి.. చినికి గాలి వానై విడాకులు తీసుకునేంత వరకు వెళ్లింది. ఇటీవలే యువ జంటకు పెళ్లైంది. అయితే భార్య హైహీల్స్ చెప్పులు కొనమని కోరితే.. భర్త కొన్నాడు. అవి వేసుకుని బయటకు వెళ్లిన భార్య.. జారి కింద పడింది. దీంతో ఆమె కాలు బెణికింది. దీంతో హైహీల్స్ చెప్పులు వాడొద్దని భర్త సూచించాడు. కానీ ఆమె మాత్రం.. తిరిగి హైహిల్స్ చెప్పులే కొనమని కోరింది. దీంతో గత నెలలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గొడవ తారాస్థాయికి వెళ్లడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అంతటితో ఆగకుండా విడాకులకు అప్లై చేసింది. దీంతో ఆగ్రాలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ వాళ్లిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. చివరికి ఇద్దరూ కూడా రాజీకి వచ్చారు. కలిసి జీవిస్తామని చెప్పడంతో కథ సుఖాంతం అయింది.
ఇది కూడా చదవండి: Sailajanath to join YSRCP: కీలక పరిణామం..! వైసీపీ గూటికి మాజీ మంత్రి.. రేపు జగన్ సమక్షంలో చేరిక