రూ.2,500 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇదే తొలిసారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధానిలో ఢిల్లీలో భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు స్పెషల్ సెల్ పోలీసులు.. 2,500 కోట్ల రూపాయల విలువైన 354 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.. డ్రగ్స్ రాకెట్‌కు సంబంధించిని నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.. ఈ ముఠాలో ఒకరు ఆప్ఘనిస్థాన్ జాతీయుడు. పంజాబ్ నుంచి ఒకరు, కాశ్మీర్ నుంచి ఒకరు.. మరొకరు ఢిల్లీకి చెందిన వ్యక్తి ఉన్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.. ఢిల్లీ పోలీసులు ఇంత పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుకోవడం ఇదే తొలిసారి. ఈ కేసులో పోలీసులు నార్కో- టెర్రరిజం కోణాలపై ఆరా తీస్తూ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇరాన్ నౌకాశ్రయం ద్వారా చట్టబద్ధమైన ఎగుమతి సామగ్రి మాటున డ్రగ్స్‌ను ముంబైకి పంపించారు అని అక్కడి నుంచి సరఫరా ప్రారంభమైందని స్పెషల్ సిపి నీరజ్ ఠాకూర్ తెలిపారు.. గత నెలలో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) డార్క్‌నెట్ మరియు ఆన్లైన్ ఫార్మసీల ద్వారా పనిచేసే డ్రగ్ రాకెట్‌ను ఛేదించింది. సైకోట్రోపిక్ మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఎన్‌సిబి ఢిల్లీ – ఎన్‌సిఆర్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులు డార్క్‌నెట్ మార్కెట్ హోస్ట్, ఇంటర్నెట్ ఫార్మసీల ద్వారా ఆర్డర్లు పొందుతున్నారు.. ఆర్డర్ తీసుకుని.. అనుమానం రాకుండా తమ ముఠా సభ్యుల నుంచి పంపిణీ చేస్తున్నారని చెబుతున్నారు పోలీసులు.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..