Jharkhand: హేమంత్ సోరెన్ vs చంపాయి సోరెన్.. బీజేపీ డబ్బుతో కొనాలని చూస్తుందన్న సీఎం..
- ఎన్నికల ముందు జార్ఖండ్ ఎన్నికల్లో కీలక పరిణామం..
- బీజేపీలోకి మాజీ సీఎం చంపాయి సోరెన్.?
- డబ్బులో పార్టీలను విడదీస్తుందన్న హేమంత్ సొరెన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand: ఎన్నికల ముందు జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జార్ఖండ్ ముక్తి మెర్చా(జేఎంఎం) సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి చంపాయి సోరెన్ బీజేపీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు చంపాయి సోరెన్ ఢిల్లీకి వెళ్లడం ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. తాను పార్టీలో తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నట్లు చంపాయి పేర్కొనడం ఆయనా పార్టీ మారుతారనే వార్తలకు బలం చేకురుస్తుంది. తన ముందు మూడు దారులు- రాజకీయాల నుంచి విరమించుకోవడం, కొత్త పార్టీని స్థాపించడం, తనకు అండగా నిలిచేవారితో ప్రయాణించడం అని అన్నారు.
Read Also: CPI Narayana: బీజేపీ తనకు అనుకూలంగా లేని రాష్ట్రాలను ఇబ్బంది పెడుతుంది..
Also Read
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
- Aadhaar Mobile Number Update: ఆధార్‌లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
- BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
అయితే, ఈ పరిణామాలపై సీఎం హేమంత్ సోరెన్ బీజేపీపై ధ్వజమెత్తాడు. ‘‘ఇళ్లను విభజించి రాజకీయ పార్టీలను కూల్చే పనిలో బీజేపీ నిమగ్నమైందని విమర్శించారు. ఒకరోజు ఈ ఎమ్మెల్యేని కొంటారు, రేపు మరో ఎమ్మెల్యేని కొంటారు. డబ్బు ఉంటే నాయకులు పార్టీ మారడానికి ఎక్కువ సమయం పట్టదు. కానీ పర్వాలేదు, ఇండియా కూటమి ప్రభుత్వం 2019 నుంచి ప్రజలకు అండగా నిలుస్తుంది’’ అని ఈ రోజు జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
హేమంత్ సొరెన్, అతని కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పరిగణించబడుతున్న చంపై సోరెన్, హేమంత్ సోరెన్ జైలులో ఉన్న సమయంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే, ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత తనను అవమానకరంగా పదవి నుంచి దించారనే చంపాయి ప్రధాన ఆరోపణ. ఇదిలా ఉంటే బీజేపీ గుజరాత్, అస్సాం, మహారాష్ట్ర నుంచి వ్యక్తుల్ని తీసుకువచ్చి గిరిజన, దళిత, ఓబీసీ, మైనారిటీ వర్గాల్లో విషం వ్యాపింపజేస్తోందని విమర్శించారు.
తాజావార్తలు
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
-
SL vs WI: కెప్టెన్‌గా కుసాల్ మెండిస్ బోణి.. వెస్టిండీస్‌పై శ్రీలంక ఘన విజయం.!
-
Bed Bugs: మీ పరుపుల్లో నల్లులు నిద్ర పోతున్నాయా? పైసా ఖర్చు లేకుండా నల్లులకు ఇలా శాశ్వతంగా చెక్ పెట్టండి!
-
Virat Kohli: ఫైనల్ తర్వాత వైభవ్‌ను వెతుక్కుంటూ వెళ్లిన కోహ్లీ.. ఏం సలహా ఇచ్చాడో చూడండి..(వీడియో)
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!