Tamil Nadu Rains: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 10జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. చెన్నై సహా మరో ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు ఇచ్చింది. రాబోయే 48 గంటల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చింది. తాంజావూర్, తిరునారూర్, తిరుకొటై జిల్లాల్లో కుండపోత వర్షం పడుతుంది. పలు ప్రాంతాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. తేని జిల్లాలో ప్రమాదకరంగా జలపాతాలు పొంగిపోర్లుతున్నాయి.
Read Also: Yellamma : హమ్మయ్య…బలగం వేణుకు హీరో దొరికేసినట్టే..?
అలాగే, చెన్నై సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లు అతలాకుతలమౌతున్నాయి. వర్షాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు సర్కార్ ఆయా జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు హాలీడెస్ ఇచ్చింది. ఆయా జిల్లాల పరిధిలో ఉన్న ఐటీ కంపెనీలు ఈ నెల 18వ తేదీ వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక, చెన్నైలో భారీ వర్షాలతో వాహనదారులు అలర్ట్ అయ్యారు. వేలచేరి పరిసరాల్లో ఉన్న వారు తమ కార్లను ఏకండా ఫ్లైఓవర్లపై పార్క్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. కాగా, రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు.. అలా పార్క్ చేసిన వాహనాలపై చలాన్లు విధిస్తున్నారు.