NTV Telugu Site icon

Delhi rain: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్.. వాహనదారుల ఇక్కట్లు

Delhirain

Delhirain

దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రహదారులు నీట మునిగాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగాలకు వెళ్లే వారంతా ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఉదయం కురిసిన వర్షం కారణంగా సాకేత్ ప్రాంతంలో ఓ వాణిజ్య కారుపై చెట్టు పడింది. వాహనంలో కూర్చున్న కారు డ్రైవర్‌ సురక్షితంగా బయటపడ్డాడు. దక్షిణ ఢిల్లీలోని ధౌలా కువాన్ నుంచి రింగ్ రోడ్ మరియు ఢిల్లీ-నోయిడా డైరెక్ట్ (DND) ఫ్లైవే వంటి ప్రధాన మార్గాలను ప్రభావితం చేసింది.

ఇది కూడా చదవండి: Raj Tarun: పరిస్థితులే తప్పులు చేయిస్తాయి.. లావణ్య ఇష్యూపై రాజ్ తరుణ్ సంచలనం

గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అలాగే పదుల కొద్ది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లో సమీపంలోని అరేబియా సముద్రంలో అస్నా తుఫాన్.. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో పలు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇది కూడా చదవండి: Telangana Rains : తెలంగాణకు తప్పిన భారీ వాన గండం.. కానీ