Site icon NTV Telugu

Karur Stampede: కరూర్‌ తొక్కిసలాట ఘటనలో వెలుగులోకి హృదయవిదారక అంశాలు..

Karur Stampede

Karur Stampede

Karur Stampede: కరూర్‌ విజయ్‌ సభ తొక్కిసలాట ఘటనలో హృదయ విదారక విషయాలు బయటకొస్తున్నాయి. తొక్కిసలాట, తోపులాట చాలా తీవ్రంగా జరిగినట్లు వైద్యుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగానే మరణాలు పెరిగాయనే అంచనాకు వచ్చారు. తమిళనాడు వైద్యవిద్య, పరిశోధన విభాగ డైరెక్టర్‌ ఆర్‌.సుగంధి రాజకుమారి నేతృత్వంలో ప్రత్యేక బృందం కరూర్‌ను సందర్శించింది. మృతులు, చికిత్స పొందుతున్న పేషెంట్లకు అందిన వైద్యం, వారి పరిస్థితి దగ్గరుండి చూసింది. కేస్‌షీట్లు, వైద్యుల నివేదికలు క్షుణ్ణంగా పరిశీలించింది. ఇందులో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి.

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

చాలా మంది కంప్రెస్సివ్‌ అస్ఫిక్సియాతో ఇబ్బందిపడి చనిపోయారని డాక్టర్లు తెలిపారు. తొక్కిసలాట, తోపులాటలో ఛాతీభాగం బలంగా ఒత్తిడికి గురవడంతో ఊపిరితిత్తులు సంకోచ, వ్యాకోచాలకు కష్టమైంది. ఊపిరితిత్తులపై ఒత్తిడి కారణంగా గాలి లోపలికి ప్రవేశించలేకపోయింది. మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోయింది. సహజంగా ఎంతటి క్లిష్టపరిస్థితుల్లోనైనా 2, 3 నిమిషాలకు మించి బతకడం కష్టం. పిల్లలైతే 30 సెకన్లలోనే ప్రభావానికి గురవుతారని వైద్యులు చెబుతున్నారు. కొందరి ఊపరితిత్తుల్ని స్కానింగ్‌లో చూసినప్పుడు ఫ్రాక్చర్స్‌ కనిపించాయని, తద్వారా తొక్కిసలాట ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు.

Read Also: Tollywood Actress : వరుస ప్లాపులు.. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి పరిమితమైన హాట్ బ్యూటీ

మరోవైపు టీవీకే పార్టీ చీఫ్‌, సినీ నటుడు విజయ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను చేపట్టిన రాష్ట్రవ్యాప్త పర్యటనలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పర్యటనలను రెండు వారాల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది.. కాగా, ఈ తొక్కిసలాట ఘటనపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి.. విజయ్‌.. అధికార డీఎంకేపై ఆరోపణలు గుప్పిస్తుండగా.. డీఎంకే.. విజయ్‌పై కౌంటర్‌ ఎటాక్ చేస్తోంది.. కాగా, ఈ ఘటనలో ఇప్పటి వరకు 41 మంది మృతుల్ని ప్రకటించారు. ఘటన జరిగిన సెప్టెంబర్‌ 27న రాత్రి కరూర్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఆసుపత్రి తెచ్చినవారిలో 39మంది మార్గమధ్యంలోనే మృతిచెందినట్లుగా వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇక, పోస్ట్‌మార్టం నిర్వహించిన 41మందిలో 18 మంది మహిళలు, 13 మంది పురుషులు, 10 మంది చిన్నారులు ఉన్నారు..

Exit mobile version