Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనలో వెలుగులోకి హృదయవిదారక అంశాలు..
- కరూర్ తొక్కిసలాట ఘటనలో హృదయవిదారక విషయాలు..
- మృతుల ఊపిరితిత్తుల్లో పగుళ్లు వచ్చాయని వైద్యుల గుర్తింపు..
- గుండెల చుట్టూ రక్తస్రావమైందంటున్న వైద్యనిపుణుల బృందం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karur Stampede: కరూర్ విజయ్ సభ తొక్కిసలాట ఘటనలో హృదయ విదారక విషయాలు బయటకొస్తున్నాయి. తొక్కిసలాట, తోపులాట చాలా తీవ్రంగా జరిగినట్లు వైద్యుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగానే మరణాలు పెరిగాయనే అంచనాకు వచ్చారు. తమిళనాడు వైద్యవిద్య, పరిశోధన విభాగ డైరెక్టర్ ఆర్.సుగంధి రాజకుమారి నేతృత్వంలో ప్రత్యేక బృందం కరూర్‌ను సందర్శించింది. మృతులు, చికిత్స పొందుతున్న పేషెంట్లకు అందిన వైద్యం, వారి పరిస్థితి దగ్గరుండి చూసింది. కేస్‌షీట్లు, వైద్యుల నివేదికలు క్షుణ్ణంగా పరిశీలించింది. ఇందులో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
చాలా మంది కంప్రెస్సివ్ అస్ఫిక్సియాతో ఇబ్బందిపడి చనిపోయారని డాక్టర్లు తెలిపారు. తొక్కిసలాట, తోపులాటలో ఛాతీభాగం బలంగా ఒత్తిడికి గురవడంతో ఊపిరితిత్తులు సంకోచ, వ్యాకోచాలకు కష్టమైంది. ఊపిరితిత్తులపై ఒత్తిడి కారణంగా గాలి లోపలికి ప్రవేశించలేకపోయింది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయింది. సహజంగా ఎంతటి క్లిష్టపరిస్థితుల్లోనైనా 2, 3 నిమిషాలకు మించి బతకడం కష్టం. పిల్లలైతే 30 సెకన్లలోనే ప్రభావానికి గురవుతారని వైద్యులు చెబుతున్నారు. కొందరి ఊపరితిత్తుల్ని స్కానింగ్‌లో చూసినప్పుడు ఫ్రాక్చర్స్ కనిపించాయని, తద్వారా తొక్కిసలాట ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు.
Read Also: Tollywood Actress : వరుస ప్లాపులు.. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి పరిమితమైన హాట్ బ్యూటీ
మరోవైపు టీవీకే పార్టీ చీఫ్, సినీ నటుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను చేపట్టిన రాష్ట్రవ్యాప్త పర్యటనలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పర్యటనలను రెండు వారాల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది.. కాగా, ఈ తొక్కిసలాట ఘటనపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి.. విజయ్.. అధికార డీఎంకేపై ఆరోపణలు గుప్పిస్తుండగా.. డీఎంకే.. విజయ్‌పై కౌంటర్ ఎటాక్ చేస్తోంది.. కాగా, ఈ ఘటనలో ఇప్పటి వరకు 41 మంది మృతుల్ని ప్రకటించారు. ఘటన జరిగిన సెప్టెంబర్ 27న రాత్రి కరూర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రి తెచ్చినవారిలో 39మంది మార్గమధ్యంలోనే మృతిచెందినట్లుగా వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇక, పోస్ట్‌మార్టం నిర్వహించిన 41మందిలో 18 మంది మహిళలు, 13 మంది పురుషులు, 10 మంది చిన్నారులు ఉన్నారు..
తాజావార్తలు
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
ట్రెండింగ్
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?