NTV Telugu Site icon

MLC Kavitha: నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ..

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: సుప్రీం కోర్టులో నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోసం సుప్రీం కోర్టును కవిత ఆశ్రయించిన విషయం తెలిసిందే. ట్రయల్ కోర్టు, హైకోర్టులు బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో కవిత సుప్రీం కోర్టు ను ఆశ్రయించింది. మహిళగా, రాజకీయ నేత, ప్రజా ప్రతినిధిగా కవిత బెయిల్ కి అర్హురాలు అంటూ కవిత తరపున వాదనలు వినిపించనున్నారు. కవిత బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బి ఆర్ గవాయ్, జస్టిస్ విశ్వ నాథన్ ల ధర్మాసనం విచారణ జరపనుంది.

Read also: Adilabad Agency: నేడు ఆదిలాబాద్ ఏజెన్సీ బంద్..

కాగా మరోవైపు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎమ్మెల్యే హరీష్ రావు నిన్న ఢిల్లీకి బయలుదేరిన విషయం తెలిసిందే. వీరితో పాటు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన కీలక నేతలను ఢిల్లీకి తీసుకెళ్లారు. అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేటీఆర్ సోదరి ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించనుంది. ఈ క్రమంలో వారంతా హస్తినకు వెళ్లారు. కవిత ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ, ఈడీ కేసులో సుమారు 6 నెలలుగా తీహార్ జైలులో వున్నారు.

Read also: Patika Bellam: పటిక బెల్లంను తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..

కానీ ఈ కేసుల్లో ఆమె ట్రయల్, హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టులు తిరస్కరించాయి. దీంతో కవిత సుప్రీం కోర్టుకు ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇవాళ సుప్రీంకోర్టు వెలువరించే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు కూడా బెయిల్ లభించింది. దీంతో కవితకు కూడా బెయిల్ వస్తుందని బీఆర్ ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అటు కవిత ఆరోగ్యం కూడా బాగా లేకపోవడంతో ఆమెకు బెయిల్ వస్తుందని భావిస్తున్నారు. బెయిల్ రాకపోతే సీబీఐ, ఈడీ తీరుకు నిరసనగా బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
PM Modi: ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు ఫోన్.. కీలక అంశాలపై చర్చ..!

Show comments