NTV Telugu Site icon

Rajnath Singh: ‘‘వర్క్ ఫ్రం హోమ్’’ విన్నా, కానీ తొలిసారి ‘‘వర్క్ ఫ్రం జైల్’’ వింటున్నా..

Rajnath Singh

Rajnath Singh

Rajnath Singh: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఉద్దేశిస్తూ కేంద్ర రక్షణ మంత్రి విమర్శలు చేశారు. ఫతేఘర్ సాహిబ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గెజ్జా రామ్ వాల్మీకి కోసం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గురించి మాట్లాడుతూ.. ఇక్కడ ఆప్ అధికార పార్టీ, అది ఎలాంటి పని చేస్తుందో మీకు పెద్దగా చెప్పనవసరం లేదని అన్నారు. ఢిల్లీలో కూడా ఇదే పార్టీ ప్రభుత్వం ఉందని, కానీ మద్యం కుంభకోణంలో ఒక నాయకుడు జైలు పాలయ్యాడని సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురించి మాట్లాడారు. ఒక వ్యక్తిపై ఏవైనా ఆరోపణలు వస్తే తన పదవికి రాజీనామా చేసే నైతిక ధైర్యం, ప్రతీ నాయకుడికి ఉండాలని తాను భావిస్తున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

Read Also: Uttar Pradesh: వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం.. కత్తితో పొడిచి హత్య

మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ జైలు పాలయ్యాడని, అక్కడి నుంచే ముఖ్యమంత్రి పదవిని కొనసాగిస్తానని చెప్పాడని, మనందరికి వర్క్ ఫ్రం ఆఫీస్, వర్క్ ఫ్రం హోమ్ గురించి తెలుసని, కానీ తొలిసారి ‘‘వర్క్ ఫ్రండ్ జైల్’’ గురించి వింటున్నానని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ అవినీతిపై అన్నాహజారేతో కలిసి కేజ్రీవాల్ ఉద్యమం చేసిన సమయంలో, దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని హజారే సూచించినప్పటికీ, కేజ్రీవాల్ తన గురువు మాట వినకుండా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని స్థాపించారని అన్నారు. ముఖ్యమంత్రి తన నివాసాన్ని ‘శీష్ మహల్’’గా మార్చి కోట్లాది ప్రజాధనాన్ని వినియోగించుకున్నాడని రాజ్‌నాథ్ ఆరోపించారు.

స్వాతి మలివాల్‌పై దాడి అంశం గురించి మాట్లాడుతూ..కేజ్రీవాల్ నివాసంలో మలివాల్‌పై దాడి చేసి, ఇప్పుడు దేశ ప్రజల ముందు ప్రసంగాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ విషయంపై కేజ్రీవాల్ 15 రోజుల పాటు మౌనంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. మీ నివాసంలో ఎంపీపై దాడి జరిగితే మౌనంగా ఉన్నాడని, అలాంటి వ్యక్తికి సీఎంగా కొనసాగే హక్కు ఉందా..? అని రాజ్‌నాథ్ ప్రజల్ని ప్రశ్నించారు. పంజాబ్ లోని 13 లోక్‌సభ స్థానాలకు జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి.