హెడ్మాస్టర్ అంటే స్కూల్లో ఉన్న టీచర్స్, పిల్లలు అందరికి హెడ్ అని అర్థం.. స్కూల్లో ఎవరు తప్పు చేసిన కూడా తాను ఒక భాధ్యత తీసుకొని దాన్ని మూలాలతో సహా సరి చెయ్యాలి.. అలాంటి గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ ఓ ప్రధానోపాధ్యాయుడు బాధ్యత తప్పి వ్యవహరించాడు. స్కూల్ కి తప్పతాగి, ఒంటిమీద సోయి లేకుండా వచ్చాడు. ఆ తరువాత తరగతి గదిలోనే.. మద్యం మత్తులో.. ఒంటిపై ఏ మాత్రం సోయి, తెలివి లేకుండా నగ్నంగా నిద్రపోయాడు.. ఈ ఘటన తో ప్రజలంతా ఉలిక్కి పడ్డారు..
అతన్ని చూసిన మిగిలిన వారంతా కూడా షాక్ అవ్వడంతో పాటు ఉన్నతాధికారులకు విషయాన్ని తెలపడంతో.. ఆ హెడ్మాస్టర్ ని సస్పెండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని బహ్రెచ్ జిల్లాలోని శివపూర్ బైరాగి ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ స్కూల్లో హెడ్మాస్టర్ గా దుర్గాప్రసాద్ జైస్వాల్ అనే వ్యక్తి విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి మద్యం తాగే అలవాటుంది.. గత కొద్ది రోజుల క్రితం కూడా అతను మద్యం సేవించి స్కూల్ కు వచ్చినట్లు తోటి టీచర్స్ చెబుతున్నారు.. ఆ సమయంలో స్కూల్లో తరగతి గదుల్లో టీచర్లు పాఠాలు చెబుతున్నారు. ఓ తరగతి గదిలోకి వెళ్లిన ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల ముందే దుస్తులన్నీ విప్పేశాడు. అక్కడే నగ్నంగా నిద్రపోయాడు. ఇది విద్యార్థులు తల్లిదండ్రులకు తెలపడంతో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు..
అతన్ని వీడియో తీశారు… ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. వెంటనే వారు ప్రధానోపాధ్యాయుడుపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేశారు. హెడ్మాస్టర్ ప్రవర్తన మీద విద్యార్థులు తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. అతను ఇలా చేయడం మొదటిసారి కాదని తరచుగా ఇలాగే చేస్తున్నాడని ఆరోపించారు. ప్రధానోపాధ్యాయుడి ఈ చేష్టలతో విసిగిపోయిన కొంతమంది అమ్మాయిలు స్కూలుకు వెళ్లడం మానేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి అతని ఉద్యోగం పోయిందని తెలుస్తుంది..