Haryana Opinion Poll: హర్యానా అసెంబ్లీ పోరులో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. స్వల్ప తేడాతో కాంగ్రెస్ గెలుపు..
- హర్యాన అసెంబ్లీ ఎన్నికలపై ఒపీనియన్ పోల్..
- కాంగ్రెస్.. బీజేపీ మధ్య హోరాహోరీ..
- స్వల్ప తేడాతో కాంగ్రెస్ అధికారం చేపట్టే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana Opinion Poll: ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో గెలుపు ప్రస్తుతం బీజేపీ, ఇండియా కూటమికి చాలా కీలకంగా మారబోతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సొంత మెజారిటీతో అధికారంలోకి రాలేకపోయిన బీజేపీ, ఈ మూడు రాష్ట్రాల్లో గెలిచి తమ పాలనకు తిరుగు లేదని నిరూపించుకోవాలని భావిస్తుండగా.. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బీజేపీని ఎట్టిపరిస్థితుల్లో అధికారంలోకి రానీవకుండా అస్త్రశస్త్రాలను ఒడ్డుతోంది. ప్రస్తుతం హర్యానాలో బీజేపీ అధికారంలో ఉండగా, మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారంలో ఉంది. జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం పాలిస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా హర్యానా ఎన్నికలపై పీపుల్స్ పల్స్ ఒపీనియన్ పోల్ విడుదలైంది. ఈ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంచనా వేసింది. అయితే, స్వల్ప తేడాతో కాంగ్రెస్ అధికారం జేజిక్కించుకుంటుందని సర్వే అంచనా వేసింది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానాలో బీజేపీకి 34-39 స్థానాలు, కాంగ్రెస్‌కి 43-48 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ప్రభుత్వం ఏర్పాటుకు 46 సీట్లు అవసరం.
Also Read
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
Read Also: MP Shocker: పోర్న్‌ని చూసి దారుణం.. 9 సోదరిపై 13 ఏళ్ల బాలుడి అత్యాచారం, హత్య..
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ మరియు జననాయక్ జనతా పార్టీ వంటి ప్రాంతీయ పార్టీలతో పాటు బహుజన్ సమాజ్ పార్టీ , ఆప్‌లు 3-8 సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. 2019 హర్యానా ఎన్నికల్లో బీజేపీకి 40, కాంగ్రెస్‌కి 31, జేజేపీకి 10, ఐఎన్ఎల్డీ ఒక స్థానంలో విజయం సాధించాయి. బీజేపీ-జేజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, ఇటీవల వీరిద్దరి మధ్య పొత్తు కూలిపోయింది.
పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం.. కాంగ్రెస్‌కి 44 శాతం, బీజేపీకి 41 శాతం ఓట్లు వస్తాయని అంచానా వేసింది. 2019లో 28 శాతం ఓట్లు కాంగ్రెస్‌కి రాగా, ఈ సారి దాని ఓట్ షేర్ 44 శాతానికి చేరుకుంటుందని, అలాగే బీజేపీకి 2019లో 36 శాతం రాగా, ఈ సారి 41 శాతానికి చేరుకుంటుందని అంచనా. జాట్లు, దళితులు కాంగ్రెస్‌కి మద్దతుగా నిలుస్తున్నారని సర్వే తెలిపింది. ఓబీసీలలో బీజేపీకి మద్దతు తగ్గిపోయిందని, ఓబీసీని సీఎంగా నియమించాలన్న వ్యూహం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చని సర్వే సూచిస్తోంది. వ్యవసాయం, అగ్నివీర్ పథకం, నిరుద్యోగం ఎన్నికలపై ప్రభావం చూపించే అంశాలుగా మారాయి. అయితే, ఎన్నికలకు మరింత సమయం ఉండటంతో ఆలోగా బీజేపీ తన ప్రదర్శనను మెరుగుపరుచుకుంటే మళ్లీ అధికారం చేపట్టవచ్చని అభిప్రాయపడింది.
తాజావార్తలు
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?