Haryana Govt: హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మతాన్ని దాచి పెట్టి పెళ్లి చేసుకునే వాళ్లపై మతమార్పిళ్ల నిరోధక చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కీలక ఆదేశాలు జారీ చేసింది. పెళ్లి కోసం జరిగే మత మార్పిడులని ఈ చట్టం అడ్డుకుంటుంది. ఈ చట్టాన్ని అతిక్రమిస్తే సుమారు 4 లక్షల రూపాయల దాకా జరిమానాతో పాటు పదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
Read Also: Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. 90 విమాన సర్వీసుల్లో అంతరాయం
అయితే, చట్ట ప్రకారం మత మార్పిడిలకి పాల్పడే వ్యక్తులు అధికారులకు దరఖాస్తు చేసుకొని, నిర్ణీత గడువుదాకా వేచి చూడాల్సి ఉంటుంది. బలవంతంగా, మోసపూరితంగా జరిగే మత మార్పిళ్లను రద్దు చేసే అవకాశం ఉంటుంది. వ్యక్తుల మతస్వేచ్ఛను అడ్డుకోవడం హర్యానా సర్కార్ ఉద్దేశం కాదని, ఆ పేరుతో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడమే తమ లక్ష్యమని వెల్లడించింది.