Site icon NTV Telugu

Nuh communal clashes: నూహ్ మతఘర్షణల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే హస్తం.. అరెస్ట్..

Nuh Violence

Nuh Violence

Nuh communal clashes: హర్యానా నూహ్ ప్రాంతంలో ఆగస్టు నెలలో మతఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఊరేగింపుగా వెళ్తున్న హిందువులపై కొంతమంది ముస్లింలు కావాలని దాడులకు పాల్పడ్డారు. భవనాలపై రాళ్లు విసరడమే కాకుండా, ఆయుధాలతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘర్షణల్లో మొత్తం ఆరుగురు మరణించారు. పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ అల్లరల్లో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్ హస్తం ఉందని తేలింది. విశ్వహిందూ పరిషత్ (VHP) యాత్ర తర్వాత జరిగిన హింసలో ఎమ్మెల్యే ప్రమేయం ఉందనే దానికి సరైన ఆధారాలు ఉన్నాయని హర్యానా పోలీసులు వెల్లడించారు.

Read Also: Patna: తాంత్రికుడు చెప్పడంతో కొడుకు కోసం కూతుళ్లను రేప్ చేసిన తండ్రి.. జీవత ఖైదు

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్ ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిరోజ్ పూర్ జిర్కాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మంగళవారం పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరారు, ఈ విచారణను అక్టోబర్ 19కి వాయిదా వేసింది కోర్టు. హింస జరిగే రోజున తాను నూహ్ లో లేనని, తనను తప్పుడు కేసులో ఇరికించారని మమ్మల్ ఆరోపించారు. తగిని ఆధారాలు దొరికిన తర్వాతనే కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిందితుడిగా పేర్కొన్నట్లు హర్యానా పోలీసులు కోర్టు తెలియజేశారు. ఈ కేసులో అతనికి వ్యతిరేకంగా ఫోన్ కాల్ రికార్డింగ్స్, ఇతర ఆధారాలు ఉన్నాయని తెలిపారు. మమ్మన్ ఖాన్ ను శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నారు.

దీనికి ముందు పోలీసులు ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్ కి రెండుసార్లు తమ ముందు హాజరుకావాలని సమస్లు పంపారు. జ్వరం కారణంగా పోలీసుల సమన్లకు హాజరుకాలేదు. ఐజీ స్థాయి అధికారితో కూడాని ఉన్నత స్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసేలా హర్యానా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఖాన్ తరుపున హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సిట్ స్వతంత్రంగా పనిచేస్తుందని, ఈ కేసును సిట్ కి బదిలీ చేయాలని ఆయన అభ్యర్థించారు. జూలై 31న నూహ్ లో వీహెచ్‌పీ తలపెట్టిన ర్యాలీలో మతఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఊరేగింపు నూహ్ పట్టణానికి రాగానే ఒక్కసారిగా దాడి జరిగింది. ఈ దాడి అనంతరం హర్యానా ప్రభుత్వం బుల్డోజర్ యాక్షన్ చేపట్టింది. అక్రమ కట్టడాలను కూల్చేసింది.

Exit mobile version