NTV Telugu Site icon

Assembly Election Results: నేడే జమ్ముకశ్మీర్‌, హర్యానా ఎన్నికల ఫలితాలు..

Haryana

Haryana

Assembly Election Results: ఈరోజు జమ్మూకశ్మీర్‌, హర్యానా ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నేటి ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభంకానుంది. ఉదయం 9 గంటలకు తొలి రౌండ్‌ ఫలితం రానుంది. అలాగే, ఉదయం 11 గంటలకు ట్రెండ్స్‌పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. హర్యానాలో 90, జమ్ముకశ్మీర్‌లో 90 నియోజకవర్గాల రిజల్ట్స్ వెలువడనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Read Also: Samsung Galaxy A16 5G: ఆరు సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌లతో మొదటి స్మార్ట్ ఫోన్..

ఇక, హర్యానా రాష్ట్రంలో 90 నియోజకవర్గాలకు గానూ 1,031 మంది క్యాండిడెట్లు ఎన్నికల బరిలో నిలిచారు. అందులో 464 ఇండిపెండెంట్‌ అభ్యర్థులు.. 101 మంది మహిళలు పోటీలో ఉన్నారు. కాగా, హర్యానాలో ఈ నెల 5వ తేదీన ఎన్నికలు జరిగింది. అయితే, జమ్మూ అండ్ కశ్మీర్‌లో 90 నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1తేదీన మూడు విడతల్లో పోలింగ్‌ కొనసాగింది. ఈ 90 నియోజకవర్గాల్లో మొత్తం 873 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయగా.. 63.45 శాతం ఓటింగ్ జరిగింది.