RBI Interest Rates: హ్యాపీగా ఇంటి రుణాలు తీసుకోవచ్చు.. వడ్డీరేట్లు పెరగవట..
RBI Interest Rates: ఇంటి రుణాలతోపాటు.. ఇతరత్రా రుణాలు తీసుకునే వారికి రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం తగ్గుతున్న నేపథ్యంలో.. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచకపోవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ దినేశ్ ఖారా అన్నారు. ఆగస్టులో జరిగే సమావేశంలోనూ రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్ల జోలికి ఆర్బీఐ వెళ్లకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఆగస్టు 8 నుంచి 10 తేదీల్లో ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం జరగనున్న నేపథ్యంలో ఎస్బీఐ ఛైర్మన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read also: Suriya: వీరుడొచ్చే వేలయ్యింది… కంగువా ఆగమనం
Also Read
- Producing States in India: భారత్‌లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
బుధవారం జరిగిన భారతీయ పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) సమావేశంలో దినేశ్ మాట్లాడారు. వడ్డీ రేట్లను సవరించేందుకు ఆర్బీఐ ఎన్నో అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటుందని, ఇందులో ద్రవ్యోల్బణం ముఖ్యమని పేర్కొన్నారు. ఒక బ్యాంకుగా వడ్డీ రేట్లు తగ్గుతాయని అనుకోవడం లేదని.. కానీ స్థిరంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. జూన్ ఎంపీసీ సమావేశంలో రెపో రేటును మార్చకుండా 6.5 శాతంగా ఉంచిన సంగతి విదితమే. రిటైల్‌కు గిరాకీ పెరుగుతున్నందున, విస్తరణ కోసం సంస్థలు మూలధన పెట్టుబడి పెడుతున్నాయని చెప్పారు. వినియోగం పెరుగుతున్నందుకు, సామర్థ్య విస్తరణకు కార్పొరేట్ సంస్థలూ పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్నాయని తెలిపారు. ప్రైవేటు మూలధన పెట్టుబడులు సరైన మార్గంలోనే వెళ్తున్నట్లు వెల్లడించారు. ఆర్థిక సేవల రంగంలో కొత్తతరం ఫిన్‌టెక్ సంస్థలు కీలకంగా మారాయని దినేశ్ ఖారా పేర్కొన్నారు. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, బ్లాక్‌చైన్, డేటా అనలిటిక్స్ లాంటి సాంకేతికతలను వినియోగిస్తూ, ఆర్థిక సేవలను మరింత సులభతరం చేస్తున్నట్లు ఆయన వివరించారు. రాబోయే ఆగస్టు సమావేశంలోనూ రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్ల జోలికి ఆర్బీఐ వెళ్లకపోవచ్చని అభిప్రాయపడ్డారు. గడిచిన కొద్ది నెలలుగా ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తున్నదని కాబట్టి ఈసారి ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లను యథాతథ స్థితిలోనే ఆర్బీఐ కొనసాగించవచ్చన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్‌లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!