West Bengal: బెంగాల్ ప్రభుత్వానికి హైకోర్ట్ షాక్.. “సందేశ్‌ఖాలీ” నిందితుడిని సీబీఐకి అప్పగించాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత షేక్ షాజహాన్‌ని సీబీఐకి అప్పగించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. బెంగాల్ సందేశ్‌ఖాలీ లైంగిక ఆరోపణలు, భూకబ్జా, రేషన్ బియ్యం కుంభకోణాలనికి పాల్పడినట్లు ఇతడిపై ఆరోపణలు ఉన్నాయి. షాజహాన్‌కి సంబంధించిన మెటీరియల్ సీబీఐకి అందించడానికి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు బెంగాల్ పోలీసులకు గడువు విధించింది.
అయితే, బెంగాల్ ప్రభుత్వం ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేయడానికి వేగంగా సిద్ధమైంది.కాగా, ఈ అప్పీల్ తిరస్కరించబడింది. నిబంధనల ప్రకారం నడుచుకుంటామని పేర్కొన్న అత్యున్నత న్యాయస్థానం, రిజిస్ట్రార్ జనరల్ ముందు ఈ పిటిషన్‌ను ప్రస్తావించాలని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని కోరింది. సీబీఐ, రాష్ట్ర పోలీసు అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం పక్కనపెట్టి, కేసును కేంద్ర ఏజెన్సీకి బదిలీ చేసింది. ఈ షేక్ షాజహాన్ కేసును సీబీఐకి అప్పగించాలని ఈడీ కోరగా.. రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
Also Read
- Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
Read Also: Heart Health: మీ గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే ఇవి తినండి..
రేషన్ బియ్యం కుంభకోణంలో షేక్ షాజహాన్ ప్రమేయం ఉందని ఈడీ అధికారులు దర్యాప్తుకు వెళ్లిన సమయంలో అతని అనుచరులు అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలోని మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అప్పటి నుంచి సందేశ్‌ఖాలీ ప్రాంతంలో మహిళలు, అక్కడి ప్రజలు తృణమూల్ గుండాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ ఉద్యమానికి బీజేపీతో సహా ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చాయి.
ఈ నేపథ్యంలో జనవరి 5 నుంచి షేక్ షాజహాన్ పరారీలో ఉన్నాడు. దాదాపుగా 55 రోజుల తర్వాత గవర్నర్, హైకోర్టు అల్టిమేటంతో పోలీసులు ఇతడిని అరెస్ట్ చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వమే షాజహాన్‌ని కాపాడుతోందని బీజేపీ విమర్శి్స్తోంది. ఈ వివాదం పెద్దది కావడంతో టీఎంసీ అతడిని 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఇతడికి బెయిల్ ఇచ్చేందుకు కూడా హైకోర్టు నిరాకరిస్తూ.. అతడిపై తమక సానుభూతి లేదని ప్రకటించింది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!