Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Hamas Leaders Visited Pakistan Occupied Kashmir Say Israel Envoy Reuven Azar

Hamas: పాక్‌లో హమాస్ అగ్ర నేతలు తిష్ట.. అక్టోబర్ 7 నాటి ప్లానే అమలు!

Published Date :April 25, 2025 , 8:45 am
By Suresh Maddala
  • పాక్‌లో హమాస్ అగ్ర నేతలు తిష్ట
  • పహల్గామ్‌లో అక్టోబర్ 7 నాటి ప్లానే అమలు!
  • ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ వెల్లడి
Hamas: పాక్‌లో హమాస్ అగ్ర నేతలు తిష్ట.. అక్టోబర్ 7 నాటి ప్లానే అమలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

హమాస్ అగ్ర నేతలు పాకిస్థాన్‌లో తిష్ట వేసినట్లుగా తెలుస్తోంది. లష్కరే తోయిబాతో కలిసి హమాస్ కలిసి పని చేస్తున్నట్లుగా తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ కూడా ధృవీకరించారు.

ఇటీవల కాలంలో హమాస్ నాయకులు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) ప్రాంతాన్ని సందర్శించినట్లుగా రూవెన్ పేర్కొన్నారు. అక్కడ జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులతో సమావేశం అయినట్లుగా తెలిపారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిపినట్లుగానే.. పహల్గామ్‌పై కూడా అదే మాదిరిగా ఉగ్రదాడి జరిగిందని.. రెండింటికీ పెద్ద తేడా లేదని రూవెన్ అజార్ పేర్కొన్నారు. ఒక ప్రణాళిక ప్రకారమే పహల్గామ్ ఉగ్రదాడి జరిగినట్లుగా వెల్లడించారు. అక్టోబర్ 7, 2023న కూడా హమాస్ పౌరులనే లక్ష్యంగా చేసుకున్నారని.. ఇప్పుడు పహల్గామ్‌లో కూడా పౌరులనే టార్గెట్ చేసుకున్నారని.. ఇదంతా హమాస్ సాహకారంతోనే పహల్గామ్ ఘటన జరిగినట్లు వివరించారు. అప్పుడు ఇజ్రాయెల్‌ పౌరులు సంగీత కార్యక్రమంలో ఉండగా దాడి చేశారని.. ఇప్పుడు పహల్గామ్‌లో కూడా పౌరులు సరదాగా గడుపుతున్న సమయంలో ఎటాక్ చేశారని గుర్తుచేశారు. హమాస్-లష్కరే తోయిబా సమన్వయంతోనే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Pak-India: ఎల్‌ఓసీ వెంబడి పాక్ కాల్పులు.. తిప్పికొడుతున్న భద్రతా దళాలు

భారత్‌ను ఒక లక్ష్యంతో దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతోనే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. కుట్రలో భాగంగానే ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్.. కాశ్మీర్‌పై రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. విదేశాల్లో ఉన్న పాక్ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ కాశ్మీర్‌పై రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. కాశ్మీర్ మన ఊపిరి, మన జీవనాడి.. దాన్ని ఎలా మరిచిపోతాం అంటూ ఉద్వేగ ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం తర్వాతే ఈ పహల్గామ్ ఘటన చోటుచేసుకుంది. ఇదంతా చూస్తుంటే.. కచ్చితంగా ఒక పక్కా స్కెచ్‌తో భారత్‌పై ఉగ్రదాడి జరిగినట్లుగా అర్థమవుతోంది.

ఇది కూడా చదవండి: Indian Airlines: ‘‘పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్ మూసివేత’’.. భారతీయ విమానాలపై అదనపు భారం..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hamas leaders visited pakistan
  • Israel envoy reuven azar
  • Occupied kashmir
  • Pahalgam terror attack

తాజావార్తలు

  • Nora Fatehi Song Controversy: నోరా ఫతేహి పాట వివాదం.. వివరణ ఇచ్చిన గీత రచయిత.. తప్పు నాది కాదు..!

  • Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!

  • Off The Record : తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు.. ఇంచార్జ్ పోస్ట్ కోసం ఫైట్..!!

  • Kakatiya University: కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. చివరకు యువతి..

  • Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions