NTV Telugu Site icon

Hamas: పీవోకేలో హమాస్ నాయకులు భారత వ్యతిరేక కార్యక్రమం.. ఉగ్రవాదులు భారీ ర్యాలీ

Hamas

Hamas

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో హమాస్ నాయకులు హల్‌చల్ సృష్టించారు. పశ్చిమాసియాకే పరిమితమైన వారి ప్రభావం ఇప్పుడు భారత్‌లో కూడా విస్తరించేందుకు కుట్ర జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి.

ఫిబ్రవరి 5, 2025 (బుధవారం) పాకిస్థాన్ కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం. దీన్ని పురస్కరించుకుని జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా ఉగ్రవాదులు.. రావలకోట్‌లోని షహీద్ సబీర్ స్టేడియంలో భారత వ్యతిరేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి హమాస్‌కు చెందిన ఉగ్రవాదులు హాజరయ్యారు. హమాస్ జెండాలు పెట్టుకున్న లగ్జరీ ఎస్‌యూవీ కార్లు, బైకులు, గుర్రాలతో భారీ ర్యాలీగా వెళ్లి ఘనస్వాగతం పలికారు. జైషే ఉగ్రవాదులు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. పూల వర్షం కూడా కురిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వీడియోలను బట్టి చూస్తే హమాస్‌.. తన సామ్రాజాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేసేందుకు హమాస్ తన సామ్రాజ్యా్న్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమానికి జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు తల్హా సైఫ్, జైష్ కమాండర్ అస్గర్ ఖాన్ కాశ్మీరీతో సహా అగ్ర ఉగ్రవాద నాయకులంతా హాజరయ్యారు. ఇక ఇరాన్‌లో హమాస్ ప్రతినిధి బృందానికి నాయకుడైన ఖలీద్ అల్-ఖాదౌమి ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. గతంలో అనేక మంది హమాస్ నాయకులు.. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని వ్యాఖ్యలు చేశారు. తాజా పరిణామాలను బట్టి చూస్తే.. దక్షిణాసియాలోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.