Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
- గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం
- జనజీవనం అస్తవ్యస్థం
- చెరువులను తలపిస్తోన్న గురుగ్రామ్ రోడ్లు
- వాహనదారులకు నరకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలోని గురుగ్రామ్‌లో భారీ వర్షం నగరాన్ని మరోసారి అతలాకుతలం చేసింది. కేవలం గంటపాటు కురిసిన వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ఉద్యోగస్తులు, విద్యార్థులు నరకయాతన పడ్డారు. ఇళ్లకు చేరుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. కార్యాలయాల్లో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేలా చూడాలని సూచించింది. అలాగే పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ఆదేశించింది.

Also Read
- Sugar Prices: చక్కెర ధరలపై గుడ్‌న్యూస్.. దిగిరానున్న ధరలు
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్‌పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
- UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
గురుగ్రామ్‌లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుమారు 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. రాజీవ్ చౌక్, ఇఫ్కో చౌక్, రైల్వే రోడ్, సెక్టార్-5, ఓల్డ్ ఢిల్లీ రోడ్, మెహ్రౌలి రోడ్, బసాయ్ రోడ్ తదితర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారీ వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులు నీటితో నిండిపోయాయి. వరద నీటిలో వాహనాలు చిక్కుకోవడంతో పలువురు వాహనదారులు వాటిని అక్కడే వదిలి వెళ్లాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పాఠశాలల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్తున్న విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో.. బురద నీటిలో కనిపించని ఓపెన్ మ్యాన్‌హోల్స్‌లో పడకుండా ఉండేందుకు ఎత్తైన బస్‌స్టాప్‌లు, ఇతర సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. వర్షం కారణంగా ఢిల్లీ-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై కూడా ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమైంది. రహదారి వెడల్పుగా ఉన్నప్పటికీ వాహనాలు నెమ్మదిగా కదిలాయి. సాధారణంగా సిగ్నేచర్ టవర్ నుంచి హీరో హోండా చౌక్ వరకు సుమారు 15 నిమిషాల్లో చేరుకునే ప్రయాణానికి.. ఈరోజు కనీసం 50 నిమిషాలు పట్టిందని ప్రయాణికులు తెలిపారు. సైబర్ హబ్ సమీపంలో గేట్‌వే టవర్ మెట్రో స్టేషన్‌కు ఎదురుగా ఉన్న ఎక్స్‌ప్రెస్‌వేలోని కొంత భాగం పూర్తిగా నీట మునిగిపోయింది. దీంతో నగరంలోని ప్రధాన రహదారుల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
గురుగ్రామ్‌ను ‘మిలీనియం సిటీ’గా పిలుస్తారు. భారీ అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్స్, ప్రముఖ కంపెనీల కార్యాలయాలకు ఈ నగరం ప్రసిద్ధి. అయితే కొద్దిసేపు భారీ వర్షం కురిసినా మౌలిక వసతులు దెబ్బతినడం, రోడ్లు జలమయం కావడం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాకాలంలో ఇప్పటికే వరదలకు గురయ్యే ప్రాంతంగా మారిన షీత్లా మాతా రోడ్ కూడా తాజా వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైంది. ప్రతి సారి కొంత ఎక్కువ సమయం వర్షం కురిసినప్పుడు నగర మౌలిక వసతులు కుప్పకూలుతున్నాయని గురుగ్రామ్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- Tags
- Delhi
- flooding
- Gurugram rain
తాజావార్తలు
-
Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
-
Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
-
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
-
Sugar Prices: చక్కెర ధరలపై గుడ్‌న్యూస్.. దిగిరానున్న ధరలు
-
CM Revanth Reddy : కొండా సురేఖ ఎపిసోడ్‌పై రేవంత్ క్లారిటీ.. కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!