Ropeway Stops Mid-Air: గాలిలో ఉండగానే అకస్మాత్తుగా ఆగిపోయిన రోప్‌వే.. చిక్కుకుపోయిన వందలాది మంది పర్యాటకులు
- గాలిలో ఉండగానే అకస్మాత్తుగా ఆగిపోయిన రోప్‌వే
- చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులు
- వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం గుల్మార్గ్లో గోండోలా కేబుల్ కార్ సేవలు సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోవడంతో వందలాది మంది పర్యాటకులు గాల్లోనే చిక్కుకుపోయారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా తెలిపారు.
ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, గోండోలా రోప్ వే లో ఉన్న అన్ని క్యాబిన్లు సురక్షితంగా ఉన్నాయని, అందులో చిక్కుకుపోయిన పర్యాటకులను దశలవారీగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని వెల్లడించారు. సాంకేతిక లోపం తలెత్తిన వెంటనే గుల్మార్గ్ గోండోలా సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. శిక్షణ పొందిన రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పర్యాటకుల్లో ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
Also Read
- Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
- Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
- EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్‌తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
- Puri Jagannath: పూరీ ఆలయ నిధుల లెక్కలు వెల్లడి.. జగన్నాథ స్వామి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా..?
సుమారు 300 మంది పర్యాటకులు గోండోలా క్యాబిన్లలో ఉన్నట్లు సమాచారం. భద్రతా ప్రమాణాలను అనుసరిస్తూ వారిని ఒక్కొక్కరిని సురక్షితంగా బయటకు తీసుకువస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. గోండోలా సేవలను పునరుద్ధరించే ముందు పూర్తి సాంకేతిక తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
-
Andhra Pradesh: గుడ్‌న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
-
KTR : సాగర్ నీళ్లపై కేటీఆర్ సమరశంఖం.. 10 రోజుల డెడ్‌లైన్..
-
Trump: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్‌పై డెమొక్రాట్ల ప్లాన్ ఇదేనా? పదవికి ముప్పుందా!
-
VVS Laxman: ముంబైలో బీసీసీఐ కీలక భేటీ.. వీవీఎస్ లక్ష్మణ్‌కు అదిరే శుభవార్త..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!