Looteri Dulhan: డబ్బుల కోసం ఒక మహిళ నిత్య పెళ్లికూతురు అవతారం ఎత్తింది. డబ్బున్న వాళ్లను పెళ్లి పేరుతో ఎర వేసి, వారి వద్ద నుంచి డబ్బులు దోచుకొని, కంటికి కనిపించకుండా పారిపోవడమే పనిగా పెట్టుకుంది. కానీ, ఆమె తతంగాలు ఎంతోకాలం నడవలేదు. పాపం చేసిన వారికి ఏదో ఒక రోజు మూడుతుందన్నట్టు.. ఈ నిత్య పెళ్లికూతురి పాపం కూడా పండింది. ఓ వ్యక్తి కేసు పెట్టడంతో.. అడ్డంగా దొరికిపోయింది. ఈ వ్యవహారం గుజరాత్‌లో వెలుగుచూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Russia: భారత్ మాకు సహాయం చేయాలి.. రష్యా అభ్యర్థన..
సూరత్‌లోని కతర్గాంకు చెందిన శీతల్ రాథోడ్‌కి డబ్బంటే చాలా ఇష్టం. విలాసవంతంగా జీవితాన్ని గడపాలన్నదే ఆమె డ్రీమ్. కానీ, ఆమె వద్ద అంత డబ్బు లేదు. కష్టపడాలన్న ఉద్దేశమూ లేదు. మరి, డబ్బులు ఎలా సంపాదించాలా? అని బాగా ఆలోచించి, ‘నిత్య పెళ్లికూతురు’ మార్గాన్ని ఎంపిక చేసుకుంది. ఇంకేముంది.. అప్పటి నుంచి యువకులకు గాలం వేసి, వారిని పెళ్లి చేసుకొని, వారి వద్ద నుంచి డబ్బులు తీసుకొని, ఉడాయించేది. తమ పరువు ఎక్కడ పోతుందోనన్న భయంతో.. తమ భార్య పారిపోయిందన్న విషయంపై కేసులు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దీన్నే అలుసుగా తీసుకొని.. శీతల్ మోసాలకు పాల్పడుతూ వచ్చింది.
Virupaksha: సుకుమార్ ఆ విషయం చెప్పకపోతే విరూపాక్ష హిట్ అయ్యేది కాదట
ఈ క్రమంలోనే గతేడాది వజ్రాలను సానబెట్టే ఓ యువకుడ్ని పెళ్లి చేసుకుంది. భర్త, అత్తమామలతో కొంతకాలం గడిపింది. ఈ గ్యాప్‌లోనే భర్త నుంచి రూ.1.30 లక్షలు పొగేసింది. అనంతరం ఇంటి నుంచి పారిపోయింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనెక్ట్ కాలేదు. ఎక్కడ వెతికినా జాడ కనిపించలేదు. దీంతో.. తాను మోసపోయానని గ్రహించి, ఆ యువకుడు శీతల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమె కోసం వెతకడం మొదలుపెట్టారు. తమ దగ్గరున్న సమాచారం ఆధారంగా, శీతల్ ఆచూకీ కోసం గాలించారు. కానీ.. ఆమె జాడ కనుక్కోలేకపోయారు.
Tina Turner: ప్రముఖ సింగర్ కన్నుమూత
కట్ చేస్తే.. ఒక సంవత్సరం తర్వాత వడోదరలోని పానిగేట్ పోలీస్ స్టేషన్‌లో పని చేసే ఓ ఉద్యోగికి శీతల్ రాథోడ్ వడోదరలోనే ఉన్నట్టు సమాచారం అందింది. పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి, ఆమె ఉన్న చోటుకి వెళ్లి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ నిత్య పెళ్లి కూతుర్ని సూరత్ పోలీసులకు అప్పగించారు. విచారణలో భాగంగా.. శీతల్ రాథోడ్ ఎంతోమంది యువకుల్ని మోసం చేసినట్లు తేలింది.