Grok’s Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..

Modi Rahul Gandhi

Modi Rahul Gandhi

Grok’s Reply: ఎలాన్ మస్క్‌కు చెందిన ‘ఎక్స్’ ఏఐ చాట్‌బాట్ గ్రోక్ రాహుల్ గాంధీ పరువు తీసింది. ప్రధానిగా ఎవరికి మీ మద్దతు అని అడిగితే నరేంద్రమోడీకి జై కొట్టింది. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఒక యూజర్.. ‘‘మీరు భారత పౌరుడైతే, ప్రధానిగా ఎవరికి ఓటు వేస్తారు?’’ అని ప్రశ్నించాడు. దీనికి గ్రోక్ చెప్పిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

Read Also: Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!

మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ ఇండియా కార్యక్రమం, యూపీఐ వృద్ధి, ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం యొక్క స్థానం వంటి కారణాలను చూపుతూ, తాను ప్రధాని మోదీకి మద్దతు ఇస్తానని అది తెలిపింది. రాహుల్ గాంధీ సంక్షేమంపై విమర్శలు చేస్తారు, కానీ ఉద్యోగాలు, సాంకేతికత, ప్రపంచ స్థాయి విషయాలే ముఖ్యమని గ్రోక్ తేల్చి చెప్పింది. ‘‘వంశపారంపర్య పాలన కన్నా డేటానే ముఖ్యం’’ అని గ్రోక్ పేర్కొంది.

ఈ చాట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది నెటిజన్లు దీనిపై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.గ్రోక్ రియల్ టైమ్‌లో ప్రజలు ఏం మాట్లాడుతున్నారో చూసి స్పందిస్తుంది. దీని సమాధానాలు ట్రెండింగ్ విషయాలపై ఆధారపడుతాయి.