Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy: ఈ మధ్య చిన్న కారణానికే హింసాత్మక చర్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా బీరంగూడలో ఓ కర్రీ పాయింట్లో జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. రూ.10కి సాంబార్ ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి తల్వార్‌తో దాడికి దిగిన సంఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఘటనకు సంబంధించి అందిన వివరాల ప్రకారం.. కర్రీ పాయింట్లో పనిచేస్తున్న ఉదయ్ అనే యువకుడిని జీవన్ అనే వ్యక్తి రూ.10కి సాంబార్ ఇవ్వమని అడిగాడు. అయితే అక్కడ సాంబార్ ప్యాకెట్ ధర రూ.30 ఉండటంతో, రూ.10కి ఇవ్వడం సాధ్యం కాదని ఉదయ్ చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన జీవన్, అప్పటికే మద్యం మత్తులో ఉండటంతో తీవ్రంగా స్పందించాడు.
మొదట గొడవ పడి వెళ్లిన జీవన్ కొద్దిసేపటికి తల్వార్‌తో తిరిగి వచ్చి షాప్ షట్టర్ మూసివేసి ఉదయ్‌పై దాడికి యత్నించాడు. ఈ సమయంలో అడ్డుకునేందుకు వచ్చిన క్యాషియర్‌పై కూడా దాడి చేయడంతో అతనికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దాడి అనంతరం జీవన్ షట్టర్ తెరిచి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read
తాజావార్తలు
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!