Supreme Court: ఇటీవల పోక్సో కేసు విచారణ సందర్భంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైంది. ‘‘వక్షోజాలను పట్టుకోవడం, పైజామా దారాలు తెంచడం అత్యాచారం లేదా అత్యాచారయత్నం కాదు’’అని హైకోర్టు వ్యాఖ్యానించింది. కానీ ఈ చర్యల్ని తీవ్రమైన లైంగిక దాడిగా పరిగణిస్తామని చెప్పింది. జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రాతో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే, ఈ వ్యాఖ్యలపై మహిళలతో పాటు సమాజం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.
ఈ వివాదాస్పద తీర్పుని సుప్రీంకోర్టు మంగళవారం పరిగణలోకి తీసుకుంది. మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి సంబంధించిన కేసులో మార్చి 17న హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం ఈ విషయాన్ని విచారిస్తుంది.
Read Also: Pakistan: హఫీస్ సయీద్ బంధువు హతం.. “గుర్తుతెలియని వ్యక్తుల” ఖాతాలో మరో ఉగ్రవాది..
11 ఏళ్ల బాలికపై జరిగిన సంఘటన వాస్తవాలను పరిశీలించిన తర్వాత, ఇది ఒక మహళ గౌరవంపై దాడి అని, అత్యాచారం ప్రయత్నం అని చెప్పలేమని జస్టిస్ మిశ్రా అన్నారు. ఈ తీర్పుని న్యాయనిపుణులు ఖండించారు. ఇలాంటి ప్రకటనల కారణంగా న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం తగ్గతుందని చెప్పారు. సీనియర్ న్యాయవాది మరియు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్ మాట్లాడుతూ, ఇలాంటి న్యాయమూర్తుల నుంచి దేశాన్ని కాపాడాలని అన్నారు. ఇదిలా ఉంటే, సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు తీర్పుకు సంబంధించిన పిటిషన్‌ని విచారించడానికి తిరస్కరించింది. మార్చి 17 నాటి తీర్పులో ఆ వివాదాస్పద భాగాన్ని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ సుప్రీంకోర్టును కోరింది. దీనికి తోడు న్యాయమూర్తులు భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిరోధించేలా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేయాలని పిటిషన్ డిమాండ్ చేసింది.
కేసు ఏంటి..?
ఉత్తర్ ప్రదేశ్ లోని కాస్గంజ్ లో 11 ఏళ్ల మైనర్ బాలిక వక్షోజాలు పట్టుకుని, ఆమె పైజామా తాడును తెంచి, కల్వర్టు కిందకు లాగడానికి ప్రయత్నించారని నిందితులు పవన్, ఆకాష్‌పై అభియోగాలు నమోదయ్యాయి. అయితే, అదే దారి గుండా వెళ్తున్న మరో వ్యక్తి ఆమెను రక్షించడంతో బాధితురాలు అక్కడి నుంచి సురక్షితంగా బయటపడింది. దీనిపై పాటియాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులోనే నిందితులైన పవన్, ఆకాశ్, అశోక్‌లపై కేసులు నమోదయ్యాయి.