Govt Bans YouTube Videos: భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం.. యూట్యూబ్ ఛానెల్స్ బ్యాన్
Govt bans 45 YouTube videos: భారతదేశానికి వ్యతిరేకంగా విషం చిమ్ముతూ.. దేశంలో అశాంతి ఏర్పడటానికి ప్రయత్నిస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై ఉక్కపాదం మోపుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పలు పాకిస్తాన్ బేస్డ్ యూట్యూబ్ ఛానెళ్లతో పాటు భారత వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్న మరికొన్ని ఛానెళ్లను కేంద్రం నిషేధించింది. తాజాగా మరో 10 యూట్యూబ్ ఛానెళ్లపై బ్యాన్ విధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఈ 10 యూట్యూబ్ ఛానెళ్లలో 45 వీడియోలను బ్లాక్ చేయాలని ఆదేశించింది కేంద్రం. ప్రస్తుతం బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెళ్ల వ్యూయర్ షిప్ 1.30 కోట్లుగా ఉంది. బ్లాక్ చేసిన వీడియోల్లో యూట్యూబర్ ధృవ్ రాతీ వీడియో కూడా ఉంది. నిఘా వర్గాల సమాచారం మేరకు సెప్టెంబర్ 23న ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
Read Also: Anti-Hijab Protests: హిజాబ్‌కు వ్యతిరేకంగా “జుట్టు ముడవడమే” తప్పైంది.. కాల్చి చంపిన ఇరాన్
దేశానికి వ్యతిరేకంగా విషం చిమ్ముతూ.. తప్పుడు సమాచారం ద్వారా స్నేహపూర్వక దేశాలతో సంబంధాలు దెబ్బతినే విధంగా చేస్తున్న 10 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేస్తున్నామని.. దేశ ప్రయోజనాల కోసం ఇంతకుముందు కూడా ఇలాగే చేశామని.. ఇకపై కూడా ఇలాగే చేస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-2021లోని నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.
ఫేక్ న్యూస్ ద్వారా మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడంతో పాటు భారతదేశంపై అంతర్యుద్ధం ప్రకటించడం, దేశంలో మతసామరస్యాన్ని, ప్రజాశాంతికి భంగం కలిగేలా ఈ యూట్యూబ్ ఛానెళ్లు పనిచేస్తున్నాయని గుర్తించింది కేంద్రం. అగ్నిపథ్ స్కీమ్, భారత సాయుధ దళాలు, భారత జాతీయ భద్రతా యంత్రాంగం, కాశ్మీర్ వంటి వాటిపై తప్పుడు సమాచారాన్ని ఈ యూట్యూబ్ ఛానెళ్లు వ్యాప్తి చేస్తున్నాయి. కొన్ని వీడియోలు భారత భూభాగం నుంచి జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను తొలగించి భారత సార్వభౌమాధికారానికి భంగం కలిగేలా ప్రయత్నిస్తున్నాయి. ఇలా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానెళ్లను నిషేధించింది కేంద్రం.
తాజావార్తలు
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
-
Ukraine: ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
-
Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..
-
Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
-
LSG vs RR: పొదుపుగా బౌలింగ్ చేసిన లక్నో.. టార్గెట్ ఎతంటే?
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?