MUDA land scam case: భూ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు హైకోర్ట్ బిగ్ షాక్..
- ముడా భూ కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యకు షాక్..
- గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించిన కర్ణాటక హైకోర్టు..
- వాస్తవాలపై విచారణ జరగాలన్న ధర్మాసనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MUDA land scam case: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భారీ షాక్ ఇచ్చింది కర్ణాటక హైకోర్టు. ముడా భూ కుంభకోణం కేసులో విచారణకు అనుమతి ఇచ్చిన కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసిందే. అయితే, దీనిని కోర్టు ఈ రోజు తోసిపుచ్చింది. జస్టిస్ ఎం నాగప్రసన్నతో కూడిన ధర్మాసనం..‘‘ ఈ కేసులో గవర్నర్ తన బుద్ధిని పూర్తిస్థాయిలో అన్వయించారని, అందువల్ల ముఖ్యమంత్రిపై విచారణకు స్వతంత్ర నిర్ణయం తీసుకోవచ్చు’’ అని పేర్కొంది. ‘‘గవర్నర్ చర్యలో ఎలాంటి తప్పు లేదు. వాస్తవాలపై విచారణ అవసరం. పిటిషన్ కొట్టివేయబడింది’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
Read Also: Minister Seethakka: ములుగు మున్సిపాలిటీ బిల్లుపై గవర్నర్ జిష్ణు దేవ్ తో సీతక్క భేటీ
Also Read
- NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
- Jharkhand JPSC Protest: రాంచీలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల పోరు.. 600 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్..
- Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. 'అడ్వాన్స్ టిప్' విధానానికి కేంద్రం చెక్
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
ముఖ్యమంత్రి తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తన ఉత్తర్వులపై రెండు వారాల పాటు స్టే విధించాలని చేసిన విజ్ఞప్తిని కూడా కోర్టు కొట్టివేసింది. తన సొంత ఉత్తర్వులపై స్టే ఇవ్వలేమని న్యాయమూర్తి తెలిపారు. అయితే, రాష్ట్ర మంత్రి వర్గం అనుమతి లేకుండా ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోలేరని సిద్ధరామయ్య వాదించారు. అక్రమంగా ఇతరత్రా భూముల మంజూరుకు సంబంధించి ముఖ్యమంత్రి ఎక్కడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సింఘ్వీ కోర్టుకు గతంలో చెప్పారు.
మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ లేదా ముడా ద్వారా భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకలతో ఈ కుంభకోణం ముడిపడి ఉంది. ముఖ్యమంత్రి భార్య బీఎం పార్వతికి చెందిన భూములను సేకరించిన ముడా, అక్కడే ఆమెకు భూములు కేటాయించకుండా, నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో, ఆమె ఇచ్చిన భూమికి రెట్టింపు విలువ కలిగిన భూమిని కేటాయించారనేది అభియోగం. సిద్ధరామయ్య భార్యకు చెందిన భూమికి పరిహారంగా కేటాయించిన 14 అత్యంత విలువ కలిగిన సైట్లు అక్రమమని, ప్రభుత్వ ఖజానాకు రూ.45 కోట్ల నష్టం వాటిల్లిందని ఆర్టీఐ యాక్టివిస్టులు ఆరోపించారు. ఆగస్టు 17న ఈ వివాదంపై ముఖ్యమంత్రిపై విచారణ జరిపేందుకు గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ సిద్ధరామయ్య వేసిన పిటిషన్‌ను అనుసరించి, హైకోర్టు ఆగస్టు 19న విచారణకు స్వీకరించింది. గవర్నర్ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తూ, దానిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి కోరారు.
తాజావార్తలు
-
Sukhbir Singh Badal: నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై దాడి
-
Bank of America: అంబానీ కంపెనీపై అమెరికా బ్యాంక్ కన్ను.. రూ.18,268 కోట్ల భారీ డీల్!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Saransh Jain: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో మజా లేదు.. సారాంశ్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
ట్రెండింగ్
-
5,000 నిట్స్ డిస్‌ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!