Free Fire Love Story: పబ్జీ ప్రేమ తరహాలోనే ఫ్రీ ఫైర్ గేమ్ లవ్ స్టోరీ.. ఇంటి నుంచి జంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gorakhpur Girl Eloped With Patna Boyfriend Who Met On Free Fire Game: పబ్జీ గేమ్ పుణ్యమా అని.. సీమా-సచిన్‌లు కలిసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ వీరి లవ్ స్టోరీ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గానే ఉంది. ఇంతలో తాజాగా ఫ్రీ ఫైర్ గేమ్ లవ్ స్టోరీ ఒకటి వెలుగు చూసింది. ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ కలిసిన ఓ అమ్మాయి, ఒక అబ్బాయి.. ప్రేమలో పడి ఇంటి నుంచి పారిపోయారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Double Bedroom: లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ.. ఈనెల 15 నుంచి ప్రారంభం
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన 21 ఏళ్ల యువతి తన మొబైల్లో తరచూ ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతుండేది. ఈ క్రమంలోనే ఈమెకు బీహార్‌కు చెందిన సుజీత్‌తో పరిచయం అయ్యింది. రెగ్యులర్‌గా మాట్లాడుకోవడం మొదలుపెట్టిన వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గాఢంగా ప్రేమించుకున్నారు. దీంతో.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ పెళ్లికి పెద్దవాళ్లు ఒప్పుకుంటారో లేదోనన్న భయంతో.. వారికి చెప్పకుండా ఇంటి నుంచి పారిపోవాలని ప్లాన్ చేశారు.
WOLF Teaser: ప్రభుదేవా పాన్ ఇండియన్ మూవీ ‘వూల్ఫ్’ టీజర్ వచ్చేసింది.. సరికొత్తగా అనసూయ!
ప్లాన్ ప్రకారం.. యువతి తన ఇంట్లో చదువుకోవడానికి వెళ్తున్నానని చెప్పి, జులై 31వ తేదీన ఇంటి నుంచి వెళ్లింది. నేరుగా పట్నాలో ఉన్న సుజీత్ వద్దకు వెళ్లింది. అక్కడి నుంచి ఇద్దరు తట్టాబుట్టా సర్దుకొని, ఇంటి నుంచి పారిపోయారు. తమ కుమార్తె సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో, ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫ్రీ ఫైర్ గేమ్ ద్వారా కలిసిన ప్రేమికుడితో పారిపోయినట్లు విచారణలో తేలింది.
Varalakshmi Sarathkumar: అయ్యో పాపం.. వాటిని పోగొట్టుకున్న హీరోయిన్.. వీడియోలో..
ఈ సందర్భంగా యువతి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కుమార్తె చదువుకుంటానని చెప్పడంతో ఆమెకు మొబైల్ ఫోన్ కొనిచ్చామని, కానీ ఆమె తమకు తెలియకుండా గేమ్ ఆడుకుంటూ ఉండేదని తెలిపారు. తమ కూతురిపై తాము పెద్ద దృష్టి పెట్టలేకపోయామని అన్నారు. తమ అమ్మాయి బాగా చదువుకునేదని, ఇలాంటి పని చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదని భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు.. పోలీసులు ఆ ఇద్దరిని గాలించే పనిలో నిమగ్నమయ్యారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!