WOLF Teaser: ప్రభుదేవా పాన్ ఇండియన్ మూవీ ‘వూల్ఫ్’ టీజర్ వచ్చేసింది.. సరికొత్తగా అనసూయ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhu Dheva, Anasuya and Raai Laxmi’s Wolf Teaser Out: సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్న ప్రభుదేవా.. ప్రస్తుతం ‘వూల్ఫ్’ చిత్రంలో నటిస్తున్నాడు. నటుడిగా ఈ సినిమా ఆయనకు 60వది. తమిళంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా.. పాన్ ఇండియన్ మూవీగా హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది. వినూ వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్న వూల్ఫ్ సినిమాను సందేశ్ నాగరాజ్, టీ-సిరీస్ భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బుధవారం వూల్ఫ్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర యూనిట్ నేడు టీజర్‌ను వదిలారు.
ఒక నిమిషం 9 సెకండ్ల నిడివి గల వూల్ఫ్ టీజర్.. అనసూయ భరద్వాజ్ ఎంట్రీతో మొదలైంది. ‘రేపు నేను ఇంటికి వెళ్లాలి.. మన లవ్ గురించి మా ఇంట్లో చెప్పాను.. ఇక్కడికి రా మాట్లాడుకుందాం అన్నారు’ అనే ఒకే ఒక్క డైలాగ్ టీజర్‌లో ఉంది. ప్రభుదేవా, అనసూయ, రాయ్ లక్ష్మి పాత్రలు చాలా కొత్తగా ఉన్నాయి. టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. హారర్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోందని టీజర్‌తో తేలిపోతుంది.
Also Read
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
వూల్ఫ్ సినిమాలో రాయ్ లక్ష్మి, అనసూయ భరద్వాజ్, అంజు కురియన్, వశిష్ట ఎన్ సింహా, శ్రీ గోపిక, రమేస్ తిలక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమ్రిష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డైరెక్షన్, కొరియోగ్రఫీపై ఎక్కువగా ఫోకస్ చేయని ప్రభుదేవా.. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. వూల్ఫ్‌తో పాటు తమిళంలో ‘ఫ్లాష్‌బ్యాక్’ అనే సినిమాను ప్రభుదేవా చేస్తున్నారు. ఇందులోనూ అనసూయ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Also Read: Samsung 110 Inch TV: శాంసంగ్ నుంచి 110 ఇంచెస్ టీవీ.. ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
తాజావార్తలు
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!