Google: గూగుల్‌కు షాక్.. రూ. 1,337 కోట్ల ఫైన్ కట్టాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google: టెక్ దిగ్గజం గూగుల్ కు షాక్ ఇచ్చింది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ). 30 రోజుల్లో రూ. 1337.76 కోట్ల జరిమానాను కట్టాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను అతిక్రమించి, గుత్తాధిపత్యంగా వ్యవహరిస్తుందని గతంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) రూ. 1337 కోట్ల జరిమానాను విధించింది. దీనిపై గతంలో గూగుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఉపశమనం దక్కలేదు. దీనిపై స్టే ఇవ్వాలని సుప్రీంను కోరింది. అయితే ఈ కేసుపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసును మార్చి 31 లోెగా తేల్చాలని ఎన్సీఎల్ఏటీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ రోజు తీర్పు చెబుతూ.. ట్రిబ్యునల్ ఫైన్ కట్టాల్సిందే అని గూగుల్ ను ఆదేశించింది.
Read Also: Karnataka: కాంగ్రెస్‌కు డీకే శివకుమార్ తలనొప్పి.. నోట్లు వెదజల్లడంపై విమర్శలు..
Also Read
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
దేశంలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై గూగుల్ గుత్తాధిపత్యంగా వ్యవహరిస్తోందని సీసీఐ జరిమానా విధించింది. దేశంలో ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారిత ఫోన్ల వినియోగమే ఎక్కువ. ఈ ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఆపరేటింగ్ సిస్టమ్స్ లో గూగుల్ ఆండ్రాయిడ్ ది 97 శాతం. అయితే నిబంధనలకు, భారతీయ చట్టాలకు విరుద్ధంగా తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తుందని ప్రధాన ఆరోపణ. గూగుల్ సంస్థ యూరప్ దేశాల్లో ఒకలా భారత్ తో మరోలా వ్యవహరిస్తోందని సీసీఐ గతంలో సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
ఈ కేసులో గత ఏడాది సుప్రీంకోర్టుకు చేరిన తర్వాత గూగుల్ భారత్ లోని ఆండ్రాయిడ్ కు భారీ మార్పులు చేసింది. వీటిలో మొబైల్ తయారీదారులు వ్యక్తిగత యాప్ లను ప్రీ-ఇన్స్టాలేషన్ కోసం అనుమతించడం, వినియోగదారులు వారి డిఫాల్ట్ సెర్చ్ ఇంజన్ ఎంచుకోవడం వంటి వాటిని మార్చింది. గూగుల్ మ్యాప్స్, జీమెయిల్, యూట్యూబ్ వంటి వాటిని ముందే అన్ ఇన్స్టాల్ చేయడానికి వినియోగదారులకు గూగుల్ అనుమతించాల్సిన అవసరం లేదు. గతంలోొ వీటిపై గూగుల్ ఇష్టారాజ్యం నడిచేది. అందుకే సీసీఐ ఫైన్ విధించింది.
తాజావార్తలు
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
-
OTR: జగ్గారెడ్డి కమిషన్ రిపోర్ట్‌లో ఏముంది..?
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!