ఈరోజుల్లో మహిళలు పలు వ్యాపారాల్లో రానిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.. మహిళలు కూడా కొత్తగా ఉండేలా చేస్తున్నారు.. మహిళలు ఇంట్లోనే ఉంటూ చేసే వ్యాపారాలు చాలానే ఉన్నాయి.. అందులో మీకోసం అదిరిపోయే బిజినెస్ ఐడియాను తీసుకొచ్చాము.. ఈ బిజినెస్ ను చేస్తే మీరు రోజుకి 2000 నుండి 3000 వరకు సంపాదించుకోవచ్చు.. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటా అనుకుంటున్నారా?.. ఇంట్లోనే చాలా సింపుల్ గా చేసే బిజినెస్ లలో ఇది ఒకటి.. మెహందీ ని తయారుచేసే బిజినెస్..
ఎటువంటి ఫంక్షన్స్ వచ్చినా కూడా ఆడవాళ్లు ఎక్కువగా మెహందిని పెట్టుకుంటారు.. పెళ్లిళ్ల సీజన్ వస్తే చాలు ఆడవాళ్లు పిల్లలు అందరు కూడా మెహందీని పెట్టుకుంటారు.. అందుకే ఏడాది పొడవునా మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంటుంది.. మెహందీ ని తయారుచేసి మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. మెహందీ కోన్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంది. దీనిని మీరు క్యాష్ చేసుకోవచ్చు. మెహందీ కి ప్రత్యేకమైన బ్రాండ్ అంటూ ఏమీ లేదు కాబట్టి మీరు సొంతంగా మంచి మెహందీ కోన్స్ ని తయారు చేసేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. గోరింటాకు మొదటగా దీనికి కావాల్సి ఉంటుంది. అలానే చక్కెర, మూలికలు, ప్యాకింగ్ కి కావలసిన సామాన్లు, పల్మనేజర్ మిషన్ వంటి వస్తువులను కొనుగోలు చెయ్యాల్సి ఉంటుంది..
అంతేకాదు వేయింగ్ మిషన్ మెహందీ పౌచ్ ఇలాంటివి కూడా ఉండాలి.. వీటిని అన్నిటిని మీరు కొనుగోలు చేసి వెంటనే దీన్ని స్టార్ట్ చేయొచ్చు. ఈ బిజినెస్ కోసం మీరు గోరింటాకు మొక్కలని పెంచుకోవచ్చు. మెహందీ ఎలా తయారు చేయాలి అనేది మీరు యూట్యూబ్ ద్వారా చూసి నేర్చుకోవచ్చు.. ఎన్నో వీడియోలు మీకు అందుబాటులో ఉన్నాయి.. మీకు దగ్గరలోని షాప్ లలో లేదా ఆన్లైన్లో అమ్మితే మంచి ఆదాయం ఉంటుంది.. అలాగే మీరు రోజుకు వంద కొన్లు అమ్మితే మీకు దాదాపుగా 2- 3 వేలు వరకు ఆదాయం పొందుతారు..