Godhra Case: గోద్రా రైలు దహనం కేసులో కీలక పరిణామం.. జీవిత ఖైదు దోషికి బెయిల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godhra Case: 2002 నాటి గోద్రా రైలు దహనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇర్ఫాన్ సిరాజ్ పాడోకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరుచేసింది. తీవ్రవైమన గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటం, ఇప్పటికే 18 ఏళ్లు జైలులో ఉండటం అనే అంశాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు, వైద్య కారణాల వల్ల అతడి జీవిత ఖైదు శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పీబీ వరాలేతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇర్ఫాన్ పాడోకు సంబంధించిన అప్పీల్ 2018 నుంచి పెండింగ్‌లో ఉంది.
ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వం నేరంతో తీవ్రతను ప్రస్తావిస్తూ కేసులో మెరిట్స్ ఆదారంగా ఉపశమనం కల్పించడాన్ని వ్యతిరేకించింది. అయితే, ఇర్ఫాన్ పాడో ఆరోగ్య సమస్యలు వాస్తవమైనవిగా ప్రభుత్వం అంగీకరించింది. దీంతో కేవలం వైద్యపరమైన కారణాలతో బెయిల్ ఇవ్వడంపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
Also Read
- Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
- Anand Mahindra: నో హారన్.. 3 గంటల ట్రాఫిక్ జామ్‌లోనూ ప్రశాంతమే.. ఐజ్వాల్‌లో క్రమశిక్షణకు ఆనంద్ మహీంద్రా ఫిదా!
- UP Elections: ఎన్నికల వేళ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల పంచాయితీ..!
- Bisleri on FSSAI Action: వాటర్ వివాదంపై బిస్లరీ వివరణ.. FSSAI చర్యలపై కీలక ప్రకటన!
గోద్రా కేసు..
2002 ఫిబ్రవరి 27న గుజరాత్ లోని గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు లోని ఎస్-6 బోగీకి నిప్పటించారు. ఈ ఘటనలో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది. ఈ ఘటన తర్వాత గుజరాత్ వ్యాప్తంగా మతకల్లోలాలు చెలరేగాయి. ఈ కేసు విచారణ తర్వాత 2011లో ప్రత్యేక న్యాయస్థానం 31 మందిని దోషులుగా నిర్ధారించింది. వీరిలో కొందరికి జీవిత ఖైదు శిక్ష విధించారు . ప్రస్తుతం ఇర్పాన్ పాడో కూడా జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు.
తాజావార్తలు
-
Godhra Case: గోద్రా రైలు దహనం కేసులో కీలక పరిణామం.. జీవిత ఖైదు దోషికి బెయిల్!
-
Nara Lokesh: ఏపీని మారిటైం, ఇండస్ట్రియల్ గేట్వేగా తీర్చిదిద్దుతాం.. లోకేష్ కీలక ప్రకటన
-
IND vs NZ 1st Test: 42 మెయిడిన్ ఓవర్లు.. 43 ఓవర్ల పాటు బ్యాటింగ్.. నాలుగు టెస్టులు డ్రా.. అరుదైన రికార్డులు ఇవే!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Nandamuri Balakrishna: ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలి.. కొత్త కౌన్సిలర్లకు బాలయ్య కీలక సందేశం
ట్రెండింగ్
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!