NTV Telugu Site icon

Bombay High Court: “పాకిస్తాన్ లేదా గల్ఫ్ కంట్రీకి వెళ్లండి”.. శరణార్థిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..

Bombay High Court

Bombay High Court

Bombay High Court: భారత ప్రభుత్వం ‘‘దేశం వదిలి వెళ్లాలి’’ అని నోటీసులు జారీ చేసినప్పటికీ యెమెన్‌కి చెందిన వ్యక్తి ఇండియాలో ఉండటంపై బాంబే హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘పాకిస్తాన్ లేదా గల్ఫ్ దేశాలకు వెళ్లాలి’’ అంటూ న్యాయమూర్తి అన్నారు. భారతదేశ ఉదారవాద వైఖరిని శరణార్థులు ‘అనవసర ప్రయోజనాలకు’ ఉపయోగించుకోలేరని న్యాయమూర్తులు రేవతి మోహితే దేరే, పృథ్వీరాజ్ చవాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది.

యెమెన్ దేశానికి చెందిన పిటిషనర్ ఖాలీద్ గోమాయి మహ్మద్ హసన్ భారతదేశంలో ఎక్కువ కాలం ఉండటంతో, ‘భారత్ నుండి వెళ్లిపోండి’ నోటీసుల్ని అధికారులు జారీ చేశారు. అయితే, ఈ బలవంతపు బహిష్కరణ నుంచి కొంత ఉపశమనం కావాలని అతను బాంబే హైకోర్టుని ఆశ్రయించారు. తాను ఆస్ట్రేలియా వెళ్లాలని అనుకుంటున్నానని కొంత సమయం కావాలని కోరారు. ‘రెఫ్యూజీ’ కార్డు హోల్డర్ అయిన పిటిషనర్ హసన్‌కు పూణే పోలీసులు ‘లీవ్ ఇండియా నోటీసు’ అందించారు. శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి హైకమిషన్ (UNHCR) వారికి శరణార్థి కార్డును జారీ చేసింది.

Read Also: Donald Trump: ఆమె భారతీయురాలా..? నల్లజాతీయురాలా?.. కమలా హారిస్‌ని ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యలు..

తన దేశం యెమెన్ ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, గత 10 ఏళ్లుగా భారత్‌లో నివసిస్తు్న్నానని, అంతర్గత అంతర్యుద్ధం కారణంగా 4.5 మిలియన్ల ప్రజలు నిరాశ్రయయ్యారని హసన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తన బహిరంగ బహిష్కరణ భార్య, పిల్లల ప్రాణాల్ని రిస్కులో పడేస్తుందని చెప్పారు. ప్రతిపాదిత బహిష్కరణ అంతర్జాతీయ ఆచార చట్టాలకు మరియు భారత రాజ్యాంగానికి విరుద్ధం అంటూ కోర్టులో వాదించారు.

హసన్ విద్యార్థి వీసాపై మార్చి 2014లో భారత్‌కు రాగా, అతని భార్య మే 2015లో మెడికల్ వీసాపై వచ్చారు. ఈ జంట వీసాల గడువు వరుసగా ఫిబ్రవరి 2017 మరియు సెప్టెంబర్ 2015లో ముగిసింది. పూణే పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలో లీవ్ ఇండియా నోటీసులు జారీ చేశారు. 14 రోజుల్లో భారత్ వదిలేయాలని ఆదేశించారు. పిటిషనర్లు ఆస్ట్రేలియాకు వీసా పొందే వరకు బహిష్కరణ నుండి రక్షణ కోరారు. శరణార్థి కార్డు హోల్డర్లను అనుమతించే 129 ఇతర దేశాలకు పిటిషనర్ వెళ్లవచ్చని పూణే పోలీసుల తరఫున వాదిస్తున్న ప్రత్యేక న్యాయవాది సందేశ్ పాటిల్‌తో ధర్మాసనం అంగీకరించింది. తాము మీకు 15 రోజుల కన్నా ఎక్కువ సమయం రక్షణ కల్పించలేమని కోర్టు చెప్పింది.

Show comments