Site icon NTV Telugu

UP: ప్రియుడ్ని పెట్టెలో దాచిన కోడలు.. అత్త ఏం చేసిందంటే..!

Up

Up

భార్యాభర్తల సంబంధాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. క్షణిక సుఖం కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. సమాజం ఏమనుకుంటుందన్న ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలించింది. ఇంతలో అత్త గారు రావడంతో ఉక్కిరి బిక్కిరి అయింది. ఎన్ని డ్రామాలు ఆడినా.. స్కెచ్ ఫలించలేదు. చివరికి అడ్డంగా బుక్కైంది. అసలేమైందంటే..!

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దంపతులు నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం ఇంట్లో వాళ్లంతా పనుల కోసం బయటకు వెళ్లిపోయారు. అలా వెళ్లారో.. లేదో ప్రియురాలు ఇంటికి రావాలని ప్రియుడికి ఫోన్ చేసి కోరింది. ఏడు ఇళ్ల దూరంలో ఉన్న యువకుడు మధ్యాహ్నం సమయంలో ప్రేయసి ఇంటికి వచ్చాడు. పక్క భవనంలోనే నివసించే అత్తకు ఏదో శబ్దం వచ్చినట్లు అనిపించడంతో కోడలు దగ్గరకు వచ్చింది. తలుపు తీయమని అడిగితే కంగారు పడిపోయింది. చాలా సేపు తీయలేదు. ఇంతలో ప్రియుడిని ట్రంకు పెట్టెలో దాచి పెట్టేసింది.

కొద్దిసేపటి తర్వాత కోడలు తలుపు తీశాక.. అత్త ఇళ్లంతా వెతికింది. ఎక్కడా కనిపించలేదు. అయితే అప్పటికే 45 నిమిషాలు అవ్వడంతో ట్రంకు పెట్టెలో దాక్కుకున్న యువకుడికి ఊపిరాడక పెట్టెను తన్నడం ప్రారంభించాడు. అయితే పెట్టె తాళం తీయమని అత్తగారు అడిగితే తన బట్టలు ఉన్నాయని తీయనని చెప్పింది. ఇంతలోనే కోడలు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. వాళ్లు వెతికినా కనిపించలేదు.

అయినా కూడా పట్టువీడని విక్రమార్కుడిలా అత్తకు ఏ మాత్రం అనుమానం తగ్గలేదు. మొత్తానికి పోలీసులకు ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. పోలీసుల ఒత్తిడితో పెట్టె తెరవగానే చెమటలు పెట్టేసి నీరసంగా యువకుడు బయటకు వచ్చాడు. అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కోడలిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడంతో యువకుడితో పాటు ఆమెను కూడా పోలీసులు తీసుకెళ్లిపోయారు.

Exit mobile version