NTV Telugu Site icon

Jammu Kashmir Issue: జర్మనీ ప్రకటనపై భారత్ ఆగ్రహం.. మీ జోక్యం అవసరం లేదని స్ట్రాంగ్ కౌంటర్

Jammu Kashmir

Jammu Kashmir

German intervention in the Kashmir issue is not necessary Says India: జమ్మూ కాశ్మీర్ అంశంపై జర్మనీ విదేశాంగ మంత్రి చేసి ప్రకటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ జోక్యం అవసరం లేదని స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. కాశ్మీర్ పై జర్మనీ అనుసరిస్తున్న వైఖరిని తిరస్కరించింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ, జర్మనీ విదేశాంగ శాఖ మంత్రి అన్నలెనా బేర్ బాక్ ఇద్దరు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కాశ్మీర్ పరిస్థితికి సంబంధించి జర్మనీ పాత్ర, బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు అన్నలేనా బేర్ వాక్. ఈ ప్రాంతంలో శాంతియుత పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి కలుగుచేసుకోవాలని అన్నారు.

అయితే ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని తిరస్కరిస్తూ.. శనివారం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదం, ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కీలక బాధ్యత పోషించాల్సిన అవసరం అంతర్జాతీయ సమాజానికి ఉందని.. భారత కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ దశాబ్ధాలుగా ఉగ్రవాదాన్ని భరించిందని.. ఇప్పటి వరకు అది కొనసాగుతుందని.. విదేశీ పౌరులు కూడా బాధితులుగా ఉన్నారని.. 26/11 ఉగ్రదాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులను యూఎన్ భద్రతా మండలి, ఎఫ్ఏటీఎఫ్ వెంబడిస్తోందని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

Read Also: Uttar Pradesh: 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. బిడ్డకు జన్మనిచ్చిన మైనర్

జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలేనా బేర్ బాక్ మాట్లాడుతూ.. భుట్టో వివరించినట్లు ఉద్రిక్తతలు ఉన్నాయని.. మేము కాల్పుల విరమరణనను అనుసరించాలని పాకిస్తాన్ కు చెబుతున్నామని.. రాజకీయంగా చర్చించాలని భారత్ దేశాన్ని కోరుతున్నామని..ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరుతున్నామని అన్నారు. దీనిపై భారత్ స్పందింస్తూ.. ముందుగా పాకిస్తాన్ నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదం గురించి యూరోపియన్ దేశాలు ఆలోచించాలని.. జమ్మూకాశ్మీర్ అంశం ద్వైాపాక్షికంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మూడో దేశం అవసరం లేదని జర్మనీకి చెప్పకనే చెప్పింది. స్వార్థం, ఉదాసీనత వల్ల దేశాలు ఈ విషయాలను గుర్తించనప్పుడు అవి శాంతిని అణగదొక్కతాయని.. తీవ్రవాద బాధితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అరిందమ్ బాగ్చీ ప్రకటనలో పేర్కొన్నారు.