ఇటీవల దేశంలో భారీగా కురిసిన వర్షాలకు చేతికి వచ్చిన పంటలు నీటిపాలు అయ్యాయి.. దాంతో ఉల్లి ధరలు ఘాటెక్కిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ లిస్ట్ లోకి వెల్లుల్లి వచ్చి చేరింది. దీంతో మళ్లీ ఆహార ద్రవ్యోల్బణం దేశంలో పెరుగుతుందనే భయాలు మెుదలయ్యాయి.. ఈ ధరలు ప్రస్తుతం సామాన్యులకు వణుకు పుట్టిస్తున్నాయి.. ఉల్లి తర్వాత ఆ స్థానంలో వెల్లుల్లి ఉంది.. భారతీయులు ఎక్కువగా వెల్లుల్లిని కూడా వంటల్లో వాడుతుంటారు.. ప్రస్తుతం ఈ వెల్లుల్లి ధరలు భారీగా పెరిగాయి..
ప్రస్తుతం మార్కెట్ లో వెల్లుల్లి ధర కిలో రూ.400లకు పైగా చేరింది. ఇకపై పెరిగిన ధరల భారంతో సామాన్యుల ఆహారం నుంచి ఈ వెల్లుల్లి కనిపించకుండా పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. జనాలు మామూలు కూరలతో పాటుగా మాంసాహార వంటకాల్లో ఎక్కువగా అల్లం-వెల్లుల్లి పేస్ట్ వినియోగిస్తుంటారు. కొత్త పంట మార్కెట్లకు రావటానికి సమయం పడుతూండటంతో ప్రస్తుతం ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారదారులు చెబుతున్నారు..
అంతేకాదు గత రెండు నెలల్లో అకాల వర్షాలు భారీగా కురిసాయి.. వర్షాల కారణంగా వేల ఎకరాల్లో పంట నీట మునిగింది.. అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నాసిక్, పూణేలోని ప్రధాన ఉత్పత్తి ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మహారాష్ట్ర అంతటా పంట దిగుబడి కూడా భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. దాంతో ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న వెల్లుల్లి ధరలకు రెక్కలు వచ్చాయి.. దాంతో గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల నుంచి వెల్లుల్లి కొనుగోలు చేస్తున్నారు.. మరో రెండు, మూడు నెలలు ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు..