Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganesh Chaturthi 2026: వినాయక చవిత వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.. గణపతికి ఇష్టమైన పత్రితో పాటు.. ఆయన మెచ్చే ఆహారాన్ని కూడా భక్తులు భక్తితో సమర్పిస్తున్నారు.. ఈ సమయంలో మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ స్వీట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కిలో రూ.27,000 ధర ఉన్న ‘గోల్డెన్ మోదక్’ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నాసిక్‌లోని విద్యా వికాస్ సర్కిల్ వద్ద ఉన్న సాగర్ స్వీట్స్ ఈ ప్రత్యేక మోదక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
కిలో రూ.27 వేలు.. బంగారు పూతతో మోదక్
మోదక్ అంటేనే గణపతికి ఇష్టమైన ప్రసాదంగా భక్తులు భావిస్తారు. దీంతో వినాయక చవితి సమయంలో దేశవ్యాప్తంగా స్వీట్ షాపుల్లో మోదక్లకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. ఈసారి నాసిక్‌లోని సాగర్ స్వీట్స్ సంప్రదాయ మోదక్‌కు విలాసవంతమైన రూపాన్ని తీసుకొచ్చింది. ఈ మోదక్పై తినడానికి అనుకూలంగా ఉండే బంగారు పూత (Edible Gold)ను పూశారు. దీంతో సాధారణ మోదక్ కాస్తా ‘గోల్డెన్ మోదక్’గా మారింది. కిలోకు రూ.27,000 ధర నిర్ణయించడంతో ఈ స్వీట్ ప్రత్యేకంగా నిలిచింది. గోల్డెన్ మోదక్‌కు సంబంధించిన వార్తలు, దృశ్యాలు వైరల్ కావడంతో షాపు వద్దకు పలువురు కస్టమర్లు, ఆసక్తిగల ప్రజలు వస్తున్నారు.
Also Read
- Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
- Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
దేశవ్యాప్తంగా ఘనంగా గణేశ్ చతుర్థి
విఘ్నాలను తొలగించే దేవుడిగా భావించే శ్రీ గణేశుడి జన్మదినాన్ని పురస్కరించుకుని గణేశ్ చతుర్థిని దేశవ్యాప్తంగా భక్తులు ఘనంగా జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఈ వేడుకలు ఎంతో ప్రసిద్ధి చెందగా.. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఇటీవలి కాలంలో వేడుకల ప్రాచుర్యం గణనీయంగా పెరిగింది. గణేశ్ చతుర్థి సాధారణంగా బహుళ రోజుల పాటు కొనసాగుతుంది. భక్తులు మట్టి గణేశ్ విగ్రహాలను ఇళ్లకు తీసుకొచ్చి లేదా మండపాల్లో ప్రతిష్ఠిస్తారు. పూజారులు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ప్రతిరోజూ పూజలు, హారతులు నిర్వహిస్తారు.
నిమజ్జనంతో ముగింపు
పలు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాథుడి ఉత్సవాలు చివర్లో నిమజ్జనంతో ముగుస్తాయి. ఈ సందర్భంగా భక్తులు గణేశుడి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్తారు. సంప్రదాయ డప్పు వాయిద్యాలు, భక్తుల నినాదాల మధ్య సమీపంలోని నీటి వనరుల్లో విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఈ కార్యక్రమం గణపతికి వీడ్కోలు పలికే సంప్రదాయంగా కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
-
Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!