Site icon NTV Telugu

India Pakistan: ‘‘ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలా..?’’ పాక్ తీరుపై భారత్..

Operation Sindoor,

Operation Sindoor,

India Pakistan: పాకిస్తాన్ తీరును భారత్ మరోసారి ఎండగట్టింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, రక్షణ శాఖ సంయుక్త సమావేశంలో పాకిస్తాన్ బుద్ధిని ప్రపంచానికి వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా దాయాది దేశంలోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అయితే, పాకిస్తాన్ మాత్రం భారత నగరాలపై బుధవారం రాత్రి సమయంలో క్షిపణి దాడులకు ప్రయత్నించిందని, భారత్ గగనతల రక్షణ వ్యవస్థ వాటిని తిప్పికొట్టినట్లు అధికారులు చెప్పారు. దీనికి ప్రతిగా భారత్ పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో దాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని దెబ్బతీసినట్లు వెల్లడించారు.

Read Also: Miss World 2025: హైదరాబాద్కు చేరుకున్న 109 దేశాల ప్రతినిధులు..!

ఇదిలా ఉంటే, ఇన్నాళ్లు తమ వద్ద ఉగ్రవాదులు లేరని బుకాయిస్తూ వస్తున్న పాకిస్తాన్ నైజాన్ని భారత్ బట్టబయలు చేసింది. ఈ రోజు విదేశాంగ కార్యదర్శి విక్రమ మిస్రీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌లో చనిపోయిన ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన విషయాన్ని ప్రపంచం ముందుంచారు. ఉగ్రవాదులకు ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించడం పాకిస్తాన్‌లో ఒక ఆచారంగా మారిందని విమర్శించారు.

హతమైన ఉగ్రవాదుల శవపేటికల ముందు యూనిఫాం ధరించి ఉన్న పాక్ సైన్యం, పోలీసులు ఉన్న ఫోటోలను అంతర్జాతీయ సమాజం ముందుంచారు. శవయాత్రలో ఆర్మీ అధికారులు పాల్గొన్న విషయాన్ని చెప్పారు. భారత్ దాడుల తర్వాత మరణించి ఉగ్రవాదులకు సెల్యూట్ చేస్తున్న పాక్ పోలీసులు, ఆర్మీ సిబ్బందికి సంబంధించి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Exit mobile version