Cigarette prices: పార్లమెంట్ సెంట్రల్ ఎక్సైజ్(సవరణ) బిల్లు -2025ను ఆమోదించింది. దీని తర్వాత భారత్‌లో సిగరెట్ల ధర భారీగా పెరుగుతాయానే చర్చ నడుస్తోంది. ఆర్థిక సహాయ మంత్రి పంజక్ చౌదరి ప్రవేశపెట్టిన ఈ బిల్లులో, సిగరేట్లు, సిగార్లు, హుక్కు, ఖైనీ వంటి అనేక పొగాకు ఉత్పత్తులపై ఎక్సైస్ సుంకాలను సవరిస్తుంది. ప్రస్తుతం, సిగరేట్ రకం, పొడవును బట్టి ప్రతీ వెయ్యి సిగరేట్లకు రూ. 200 నుంచి రూ. 735 వరకు ఎక్సైజ్ డ్యూటీ ఉంది. కొత్త సవరణల ప్రకారం ఇది రూ. 2700 నుంచి రూ. 11,000 వరకు పెరగనున్నట్లు తెలుస్తోంది.
Read Also: Pakistan: “అవును, నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారత్ దాడి చేసింది”.. అంగీకరించిన పాకిస్తాన్..
అధికారుల అంచనా ప్రకారం, ప్రస్తుతం రూ.18కి లభించే సిగరెట్ ధర రూ. 72 వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే విధంగా చూయింగ్ టొబాకోపై పన్ను 25 శాతం నుంచి 100 శాతానికి, హుక్కా టొబాకోపై పన్ను 25 శాతం నుంచి 40 శాతానికి, స్మోకింగ్ మిశ్రమాలపై పన్ను 60 శాతం నుంచి 300 శాతానికి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ధరల పెంపు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీని వల్ల చాలా మంది పొగ తాగడం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటారని కొందరు భావిస్తే, మరికొందరు ఎంత ధరలు పెరిగినా స్మోకర్లు మారరు అని చెబుతున్నారు.