Site icon NTV Telugu

Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కలిసిన బాలీవుడ్ నటులు.. ఫొటోలు వైరల్

Macron

Macron

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దంపతులు భారత్‌లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం మంగళవారం తెల్లవారుజామున ముంబైకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, మంత్రులు ఘనస్వాగతం పలికారు. హోటల్‌కు చేరుకున్నాక ముంబై రోడ్లపైకి జాగింగ్‌కు వచ్చేశారు. ఇక అధికారిక కార్యక్రమాల్లో భాగంగా మాక్రాన్-ప్రధాని మోడీ కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు.

ఇక పర్యటనలో భాగంగా ముంబైలో బాలీవుడ్ లెజెండ్స్‌ను కలిశారు. అనిల్ కపూర్, మనోజ్ బాజ్‌పేయి, జోయా అక్తర్, షబానా అజ్మీ, రిచా చద్దా, దర్శకుడు నీరజ్ ఘయ్వాన్, గ్రామీ అవార్డు గెలుచుకున్న స్వరకర్త రికీ కేజ్‌లను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మాక్రాన్, అనిల్ కపూర్‌ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

‘‘భారతీయ సినిమా దిగ్గజాలతో పాటు.. సంస్కృతి ఒకచోట చేర్చింది’’ అంటూ మాక్రాన్ రాసుకొచ్చారు. అలాగే అనిల్ కపూర్ కూడా పోస్ట్ చేశారు. ‘‘‘అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఆయన ప్రియమైన భార్య బ్రిగిట్టేతో స్ఫూర్తిదాయకమైన మధ్యాహ్నం గడిపాం. సినిమా, సంస్కృతి, భారతదేశం-ఫ్రాన్స్ మధ్య శక్తివంతమైన ఆలోచనలను చర్చించుకున్నాం’’ అని రాసుకొచ్చారు.

Exit mobile version