NTV Telugu Site icon

Free Aadhaar Update: ఆధార్‌ ఫ్రీ అప్‌డేట్‌.. చివరి గడువు రేపే! తర్వాత డబ్బులు కట్టాల్సిందే

Aadhaar

Aadhaar

Aadhar Free Document update Last Date is June 14: ప్రస్తుతం భారతదేశంలోని ప్రతి ఒక్కరి జీవితంలో ‘ఆధార్ కార్డు’ భాగమైపోయింది. ప్రతి పనికి ఆధార్ కార్డు తప్పనిసరి అయింది. అందులో ఏ చిన్న తప్పు ఉన్నా.. పని ఆగిపోతుంది. అందుకే ఆధార్ కార్డులో అన్ని వివరాలు సరిగా ఉండేలా చూసుకోవాలి. పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ లాంటి వివరాలు తప్పుగా ఉంటే వెంటనే సరి చేసుకోవాలి. ఆధార్‌ అప్‌డేట్‌ కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆధార్ వివరాలను మీరు ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవడానికి కేంద్రం మంచి అవకాశం కల్పించింది. ఈ గడువుకు సమయం దగ్గరపడింది.

ఫ్రీగా మీ ఆధార్ వివరాలను అప్‌‌డేట్ చేసుకోవవడానికి ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (యూఐడీఏఐ) 2023 మార్చి 15 నుంచి ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ గడువు బుధవారం (2023 జూన్‌ 14)తో ముగియనుంది. ఈ గడువు ముగిశాక అందరూ డబ్బులు చెల్లించి అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే మీ ఆధార్ కార్డులో ఏవైనా పొరపాట్లు ఉంటే ఇప్పుడే సరిచేసుకోండి.

Also Read: OnePlus Nord 3 Launch: వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 ఫోటో లీక్.. సూపర్ లుకింగ్, బెస్ట్ ఫీచర్స్!

యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ప్రతి ఐదు ఏళ్లకు ఆధార్‌ కార్డుకు సంబంధించిన వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అప్‌డేట్‌ కోసం రుజువు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్‌ ఉచిత సేవలు మై ఆధార్‌ పోర్టల్‌ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ వంటి మార్పులు చేసుకోవచ్చు. ఉచితం గడువు ముగిశాక.. ఆధార్‌ కేంద్రాల్లో రూ. 50 చెల్లించి అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మై ఆధార్ పోర్టల్ ద్వారా ఎలా అప్‌డేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రీ ఆధార్‌ అప్‌డేట్ ప్రాసెస్ (Aadhar Free Update Process):
# https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌లో ఆధార్‌ నెంబర్‌ ఎంటర్ చేసి లాగిన్‌ అవ్వాలి.
# ‘ప్రొసీడ్‌ టు అప్‌డేట్‌ అడ్రస్‌’ ఆప్షన్‌ క్లిక్‌ చేయాలి.
# రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
# ఓటీపీ ఎంటర్‌ చేసిన తర్వాత డాక్యుమెంట్‌ అప్‌డేట్‌పై క్లిక్‌ చేయాలి. అపుడు డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇందులో సవరణ ఉంటే చేసేయాలి. లేదా ఉన్న వివరాలను వెరిఫై చేసుకొని నెక్ట్స్‌పై క్లిక్‌ చేయాలి.
# ఆ తర్వాత డ్రాప్‌డౌన్‌ లిస్ట్‌ నుంచి ప్రూఫ్‌ ఆఫ్‌ ఐడెంటిటీ, ప్రూఫ్‌ ఆఫ్‌ అడ్రస్‌ డాక్యుమెంట్లను ఎంచుకోవాలి. డాక్యుమెంట్ల స్కాన్డ్‌ కాపీలను అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌ బటన్ క్లిక్‌ చేయాలి.
# 14 అంకెల అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నెంబర్‌ వస్తుంది.
# అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నెంబర్‌ ద్వారా అప్‌డేట్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోవచ్చు.

Also Read: Thomson Washing Machine Price: కేవలం రూ.5590కే థామ్సన్ వాషింగ్ మెషీన్.. ఈ ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు!