Thomson 7kg Washing Machine Offers and Discounts: ‘థామ్సన్’ యొక్క ఎలక్ట్రానిక్ వస్తువులకు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. ధర తక్కువగా ఉండడం, ఎక్కువ కాలం పని చేయడం వలన థామ్సన్ ఎలక్ట్రానిక్ వస్తువులకు మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే మీకు వాషింగ్ మెషీన్ అవసరం ఉంటే.. మార్కెట్లో ఎక్కడా తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ బడ్జెట్‌కు సరిపోయేలా, చాలా సంవత్సరాలుగా పనిచేసే అత్యంత ప్రజాదరణ పొందిన థామ్సన్ వాషింగ్ మెషీన్ అందుబాటులో ఉంది. కేవలం మీరు రూ.5590కే వాషింగ్ మెషీన్ ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఆ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం.
పైన చెప్పిన వాషింగ్ మెషిన్ మరేదో కాదు.. థామ్సన్ 7 కిలోల సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్. ఇది 7 కిలోల ఎంపికలో వస్తుంది. దాంతో మీరు ఒకేసారి చాలా బట్టలు ఉతకడానికి వీలుంటుంది. ఇది సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ కాబట్టి మీరు ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. థామ్సన్ 7 కిలోల సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ టాప్ లోడింగ్ మోడల్ అని మీరు గుర్తుంచుకోవాలి.
Also Read: V Madhusudhan Rao Shatajayanthi Celebrations: ఘనంగా విక్టరీ మధుసూదనరావు శతజయంతి వేడుకలు!
ప్రస్తుత రోజుల్లో చాలామంది స్త్రీలు పాదాల సమస్యలను కలిగి ఉన్నారు. కాబట్టి ఆ సమస్యను దృష్టిలో ఉంచుకుని.. ఈ వాషింగ్ మెషీన్ ఉత్తమ ఎంపికగా నిరూపించబడుతుంది. ఎందుకంటే ఈ వాషింగ్ మెషీన్ నాబ్‌లతో వస్తుంది. వీటితో ఈ వాషింగ్ మెషీన్‌ను చాలా సులభంగా ఉపయోగించవచ్చు. ఇలాంటి సూపర్ వాషింగ్ మెషీన్‌ను మీరు కేవలం రూ. 6 వేల లోపే సొంతం చేసుకోవచ్చు.
థామ్సన్ 7 కిలోల వాషింగ్ మెషీన్ అసలు ధర రూ. 10,499. అయితే దీనిపై 25% తగ్గింపు ఉంది. దాంతో వినియోగదారులకు ఈ మెషిన్ కేవలం 7,790 రూపాయలకే వస్తుంది. అయితే,ఈ వాషింగ్ మెషీన్ మరింత తక్కువ ధరకు కూడా కొనుగోలు చేయవచ్చు. వాస్తవానికి ఈ వాషింగ్ మెషీన్‌పై రూ. 2,200 ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఉంది. మీకు ఈ ఎక్స్‌ఛేంజ్ బోనస్ లభిస్తే.. కేవలం రూ.5,590కే ఈ వాషింగ్ మెషీన్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు.