New Housing Scheme: 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొత్త గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇది నగరాల్లో అద్దెకు నివసిస్తున్న అధిక జనాభాకు శుభవార్త కానుంది. దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో నగరాల్లో అద్దె ఇళ్లలో నివసించే దేశంలోని మధ్యతరగతి ప్రజల కోసం తమ ప్రభుత్వం త్వరలో కొత్త పథకాన్ని ప్రారంభించబోతోందని ప్రధాని మోడీ చెప్పారు. దీంతో ప్రజల సొంత ఇంటి కల సాకారం కావడంతోపాటు ఖరీదైన బ్యాంకు వడ్డీల నుంచి కూడా ఉపశమనం లభించనుంది.
ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి, దేశంలో పెద్ద సంఖ్యలో పట్టణ ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో నివసిస్తున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్య తరగతి కుటుంబాలకు సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు ప్రభుత్వం వడ్డీ రాయితీ పథకాన్ని ప్రారంభించనుంది. దేశంలోని లక్షలాది కుటుంబాలకు ఇళ్లు కొనుగోలు చేసేందుకు సాయం చేస్తామని అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందుకోసం రుణ వడ్డీకి ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం త్వరలో పథకాన్ని ప్రారంభించబోతోంది. దరఖాస్తులు, మురికివాడల్లో నివసించే ప్రజలు, అనధికార కాలనీల్లో నివసిస్తున్న కుటుంబాలు దీని ప్రత్యక్ష ప్రయోజనం పొందుతాయి. దీంతో పాటు వీలైనంత త్వరగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తుందని తెలిపారు.
Read Also:Asia Cup 2023: ఒక్క సిరీస్ కెరీర్‌నే మార్చేసింది.. తిలక్ వర్మకు ఆసియా కప్ 2023లో చోటు!
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ (PMAY-U)
పట్టణ ప్రాంతాల్లో నివసించే పేద, మధ్య తరగతి కుటుంబాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ (PMAY-U) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం జూన్ 25, 2015న ప్రారంభించబడింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలతో కూడిన పక్కా గృహాలు తక్కువ ధరకు అందించబడతాయి.
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. జూలై 31, 2023 వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మొత్తం 118.90 లక్షల ఇళ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో 76.02 లక్షల ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వగా మిగిలిన వాటిలో పనులు కొనసాగుతున్నాయి. PMAY-U క్రెడిట్-లింక్డ్ సబ్సిడీ పథకం కింద దేశంలోని పేద వర్గానికి 6.5 శాతం వడ్డీ రేటు రాయితీ లభిస్తుంది. ప్రతి ఇంటికి లబ్ధిదారులు మొత్తం రూ. 2.67 లక్షల ప్రయోజనం పొందవచ్చు.
Read Also:Prabhas: ‘సలార్’ రన్ టైం లీక్… ఎన్ని గంటల విధ్వంసం?